50 ఏళ్ల హీరోయిన్‌తో కుర్ర హీరో డేటింగ్.. ఎట్టకేలకు 17 ఏళ్లకు బ్రేకప్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ సహజమే. అయితే 50 ఏళ్ల హీరోయిన్ తో ఓ యంగ్ హీరో 17ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. బాలీవుడ్ వార్తలు ఫాలో అయ్యే వారికి ఈ పాటికి వారేవరో అర్థం అయి ఉంటుంది. వారు ఎవరో కాదు.. బీటౌన్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్. వీరు ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ ఎక్కువగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త 57 సంవత్సరాల వయస్సులో రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మలైకా, నటుడు అర్జున్ కపూర్ బ్రేకప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ కలిసి ఉండే ఈ జంట... గత కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి కనిపించడం లేదు.

ఇక గతే ఏడాది మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ సెలబ్రెట్ చేసుకుంది. పైగా వీరిద్దరూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకరి గురించి మరొకరు ఎలాంటి పోస్టులు పెట్టుకోకపోవడంతో... వీరి బ్రేకప్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మలైకా, అర్జున్ ఎప్పుడూ తమ సంబంధం గురించి ఎదో ఒక సందర్భంలో బయటపెట్టేవారు. ఇదిలా ఉంటే... మలైకా-అర్జున్‌ల పెళ్లిపై చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు రావడంతో.. వారి మ్యూచువల్ అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే మలైకా మరియు అర్జున్ రెండు నెలల క్రితం విడిపోయారని సమాచారం. ప్రస్తుతం మలైకా, అర్జున్‌ల బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వీరి బ్రేకప్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారట. చాలా కాలంగా మలైకా , అర్జున్ డేటింగ్ చేస్తున్నారు. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్ - మలైకా విడాకులు తీసుకున్నారు.
ఇక అర్బాజ్ ఖాన్ మలైకా విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వారి అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు. వీరిద్దరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ మలైకా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. మొదట్లో ఇద్దరూ తమ బంధాన్ని సీక్రెట్ గా మెయిన్ టెయిన్ చేసేవారు. ఎట్టకేలకు 2019లో మలైకా - అర్జున్ తమ బంధాన్ని బయటపెట్టారు.

ఇక తనకంటే ఏజ్ లో పెద్ద ఆమెతో డేటింగ్ చేయడంపై అర్జున్ కపూర్ ను, మలైకాను ట్రోలింగ్ చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య బ్రేకప్ అనే టాక్ నడుస్తుంది. 50ఏళ్ల హీరోయిన్ కు ఎట్టకేలకు 17ఏళ్ల తర్వాత అర్జున్ కపూర్ బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











