twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్‌కు షాకిచ్చిన కింగ్.. తమిళ్ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో..

    |

    తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించిన విక్రమ్ వేద సినిమాను బాలీవుడ్‌ టాప్ హీరో షారుక్‌ ఖాన్‌ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పుష్కర్‌-గాయత్రి దర్శకత్వం వహించారు. ఎస్‌. శశికాంత్‌ నిర్మాతగా వ్యవహరించారు. గత ఏడాది జులైలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఒక ప్రముఖ హీరో ఈ సినిమాను బాలివుడ్ లో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

    కోలివుడ్ సినిమా బాలివుడ్ లోకి..

    కోలివుడ్ సినిమా బాలివుడ్ లోకి..

    తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించిన విక్రమ్ వేద సినిమాను బాలీవుడ్‌ టాప్ హీరో షారుక్‌ ఖాన్‌ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పుష్కర్‌-గాయత్రి దర్శకత్వం వహించారు. ఎస్‌. శశికాంత్‌ నిర్మాతగా వ్యవహరించారు. గత ఏడాది జులైలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

    డైరెక్టర్ మారే అవకాశం ఉంది..

    డైరెక్టర్ మారే అవకాశం ఉంది..

    తాజాగా ఈ సినిమాను చూసిన షారుక్ రీమేక్ చెయ్యాలని భావిస్తున్నట్లు బాలివుడ్ నుండి అందుతున్న వార్తా. అయితే హిందీ సినిమా కోసం మాతృకను తెరకెక్కించిన దర్శకులు కాకుండా నీరజ్‌‌ పాండే ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైనాట్‌ స్టూడియోస్‌, ప్లాన్‌ సి స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయని అంటున్నారు. విజయ్‌ పాత్రలో షారుక్‌ నటిస్తుండగా, మాధవాన్ పాత్రలో అతనే నటించే అవకాశాలు ఉన్నాయి.

    వెంకటేష్ చెయ్యాలి అనుకున్నాడు...

    వెంకటేష్ చెయ్యాలి అనుకున్నాడు...

    ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి, కాని కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా మొదలుకాలేదు, వెంకటేష్ తరువాత మరో ఇద్దరి పేర్లు వినిపించాయి కాని వారు కూడా చెయ్యలేదు. చివరికి ఈ సినిమా తెలుగులో ఎవరు చేస్తారు అనుకోనేలోపే షారుక్ ఈ సినిమా చేయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హీరో తాజాగా ‘జీరో' సినిమాలో నటిస్తున్నాడు.

    గ్యాంగ్ స్టర్ సినిమాలు అక్కడ బాగా చూస్తారు..

    గ్యాంగ్ స్టర్ సినిమాలు అక్కడ బాగా చూస్తారు..

    గ్యాంగ్ స్టర్ నేపద్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాలివుడ్ లో ఇంకా పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే బాలివుడ్ లో ఇలాంటి కథలు ఎక్కువ సక్సెస్ అయ్యాయి. చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఈ సినిమాను షారుక్ స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బాలివుడ్ వర్గాలు చెబుతున్నాయి.

    English summary
    shah rukh khan ro remake tamil hit film vikram veda, Directed by Pushkar and Gayatri -Neeraj Pandey's PLAN C Studios and Reliance Entertainment acquire the Hindi remake rights of R Madhavan's Vikram Vedha. Official annoncement very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X