రామ్‌చరణ్‌కు జాన్వీ కపూర్ హ్యాండ్ ఇచ్చిందా?.. అది కూడా ఇన్నీ కండిషన్స్ పెట్టిందా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు హ్యాండ్ ఇచ్చిందటా. ఆ వివరాలు..

అతిలోకసుందరి అలనాటి నటి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు. కానీ నటనా పరంగా ఇప్పటికే ఎన్నో అవకాశాలను అందుకుంది. గ్లామర్‌ రోల్స్ కన్నా కూడా కొత్తదనం నిండిన కథల్లోనే నటిస్తోంది. విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తోంది.

Janhvi kapoor

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది జాన్వి కపూర్. ఈ చిత్రం రిలీజ్ కాకముందే అమ్మడుకు మరో తెలుగు సినిమా ఆఫర్ కూడా వచ్చిందని తెలిసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైందని అంతా అన్నారు. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

అయితే మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న సమయంలో మరో షాకింగ్ వార్తా బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా నుంచి జాన్వి కపూర్ ని తప్పించినట్లు తెలిసింది. అందుకు కారణం.. జాన్వీ కపూర్ పెడుతున్న షరతులే అని తెలిసింది. ఈ అమ్మడు రామ్ చరణ్ కు సమానంగా స్క్రీన్ స్పేస్ అడిగిందట. అంతేకాదు అక్కడికి రాను ఇక్కడికి రాను అంటూ .. కాల్ షీట్స్ కూడా కష్టమంటూ కండిషన్స్ పెడుతుందని తెలిసింది.

 ram charan janhvi kapoor

మరోవైపు మాత్రం దర్శకుడు కొరటాల శివ ఏం చెప్పినా వింటుందట. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇన్ని కండిషన్స్ భరించడం కష్టం అని సైలెంట్ గా ఆమెను తప్పించారట. దీంతో జాన్వికి ఓ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం పోయి బిగ్ షాక్ తగిలి నట్టయింది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలీదు ఇదంతా సినీ వర్గాల ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గానే ఉంది. ఆమె చేతుల్లో దేవర తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్, ఉలాజ్ వంటి సినిమాలున్నాయి. ఇవన్నీ హిట్ కావాలని ఆమె మంచి కమర్షియల్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X