»   » ప్రభాస్‌ను పట్టేసిన కుర్ర హీరోయిన్.. ఫ్లాట్ అయిన బాహుబలి..

ప్రభాస్‌ను పట్టేసిన కుర్ర హీరోయిన్.. ఫ్లాట్ అయిన బాహుబలి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో జూనియర్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఒకరయ్యారు. ప్రభాస్‌ను యువతులు పిచ్చిగా అభిమానిస్తారు. పడిచస్తారు కూడా. బాహుబలి రిలీజ్ అనంతరం దేశవ్యాప్తంగా ఫీమేల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనే కాకుండా అన్ని సినిమా పరిశ్రమల్లోని కుర్ర హీరోయిన్లు మనసు పారేసుకున్నట్టు అనేక సందర్బాల్లో వెల్లడైంది కూడా.

ప్రభాస్‌ను పిచ్చిగా..

ప్రభాస్‌ను పిచ్చిగా..

తాజాగా ప్రభాస్‌ను పిచ్చిగా ఇష్టపడే జాబితాలో కియారా అద్వానీ చేరిపోయారట. ఎప్పటి నుంచి ప్రభాస్‌ను కలువాలని కలలు కంటున్న యువ హీరోయిన్ చివరకు అనుకున్నది సాధించేసిందట. టాలీవుడ్‌లోని స్నేహితుడి ద్వారా ప్రభాస్‌ను లైన్లో పెట్టేసినట్టు సమాచారం.

కియారా మేసేజ్‌కు రిప్లే

కియారా మేసేజ్‌కు రిప్లే

స్నేహితుడి ద్వారా ప్రభాస్‌ ఫోన్ నంబర్‌ సంపాదించిన కియారా చివరికి ఎలాగోలా ధైర్యం చేసి మేసేజ్ పెట్టిందట. ఆ మెసేజ్ చూసిన రెబల్ దానికి సమాధానం ఇవ్వడం ఎగిరి గంతేసినంత పనిచేసిందట. టాలీవుడ్‌లోని తన స్నేహితులకు, హీరోయిన్లతో ఈ విషయాన్ని పంచుకొన్నదట. ప్రభాస్ రిప్లై మహిమ ఆ రేంజ్‌లో ఉందట.

మహేశ్ బాబు సరసన..

మహేశ్ బాబు సరసన..

ఎంఎస్ ధోని చిత్రంతో కియారా అద్వానీ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చే భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్‌గా పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన నటించేందుకు దిశా పటానీ, పరిణితి చోప్రా‌తోపాటు కియారా పేరు పరిశీలనలో ఉంది. అయితే దర్శక, నిర్మాతలు కియారాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.

సల్మాన్ నా మెంటర్..

సల్మాన్ నా మెంటర్..

సినీ పరిశ్రమలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కియారా మెంటర్‌గా భావిస్తుంది. ప్రతీ విషయంలోనూ సల్మాన్ సలహాను తీసుకుంటాను. సల్మాన్ నిజాయితీగా సలహాలు ఇస్తారు. కష్టపడి పనిచేయాలని సూచనలు ఇస్తుంటారు. సల్మాన్‌తో నటించాలని ఉంది. కానీ ఆయనతో చెప్పేంత ధైర్యం నాకు లేదు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కియారా వెల్లడించింది.

English summary
At last Glamour Doll Kiara Advani reached to Baahubali star Prabhas. Kiara sends to a message to Prabhas to reveal her interest upon him. Prabhas instantly reacted to kiara message and reply back to her. Now she is cloud nine at this moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu