చిరంజీవితో బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. ఆటా పాటతో కవ్వించనున్న బోల్డ్ స్టార్!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతల సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సంయుక్తంగా మెగాస్టార్ చిరంజీవితో చిత్రం నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ( #Mega157) కు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తున్నదనే వార్త వివరాల్లోకి వెళితే..

Mega157 సినిమాకు సంబంధించినంత వరకు ఈ చిత్రం నయనతార హీరోయిన్‌గా క్యాథరీన్ త్రెసా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పీఈటీ మాస్టారుగా నటిస్తున్నారు. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ తరహాలతో వింటేజ్ చిరంజీవిని చూసే విధంగా కంటెంట్ ప్లాన్ చేశారు. కామెడీ, యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో శంకర వర ప్రసాద్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. . పూర్తిగా వినోదాత్మక చిత్రం అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి వెల్లడించారు.

Bollywood Heroine Mouni Roy

చిరంజీవితోపాటు ఈ సినిమాలోని అతిథి పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారనున్నాయి. ఈ మూవీలో వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయం. తెర మీద చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించడం ఇరువురు అభిమానులకు పెద్ద పండగే. తాను చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నానని వెంకటేష్ ఇటీవల అమెరికాలో జరిగిన తానా వేడుకల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పెద్ద అసెట్‌గా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ నిలిచింది. ఈ సినిమాకు కూడా భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం చిరంజీవికి సంబంధించిన ఆట కావాలా? పాట కావాలా? పాటను రీమిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటేస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఈ పాటను రీమిక్స్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. ఈ పాటతో మరోసారి చిరంజీవి అభిమానులు థియేటర్లలో స్టెప్పులేయాల్సిందే అని పేర్కొంటున్నారు.

అయితే ఆట కావాలా? పాట కావాలా? రీమిక్స్ సాంగ్ కోసం పలువురు యంగ్ హీరోయిన్లను పరిశీలించారు. చివరకు హిందీలో మంచి యాక్టర్‌గానే కాకుండా డ్యాన్సర్‌గా పేరు ఉన్న నాగిని ఫేమ్ మౌనీ రాయ్‌ను ఈ పాటలో స్పెషల్ అప్పీయరెన్స్‌గా తీసుకోవాలని ఫిక్స్ చేశారు. త్వరలోనే చిరంజీవి, మౌనీ రాయ్‌పై ఈ పాటను పిక్చరైజ్ చేస్తారనే వార్త మీడియాలో వినిపిస్తున్నది. అయితే అధికారికంగా టీమ్ మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

ఇటీవలే ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్పోరి ప్రాంతంలో సుదీర్గంగా షూట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, నయనతారపై కొన్ని కీలక సన్నివేశాలు, ఇతర నటీనటులపై మరికొన్ని సన్నివేశాలు పూర్తి చేసినట్టు వెల్లడించారు. చిరంజీవితో ఇటీవల కాలంలో నయనతార నటించడం మూడోసారి. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత మళ్లీ ఈ చిత్రంలోకలిసి నటిస్తుండటం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X