Balakrishna - Sharukh Khan: బాలయ్యను కాపీ కొట్టిన షారుఖ్.. మొత్తం దింపేశాడుగా!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా... సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతోంది. దానికి కారణం ఈ సినిమాలోని సీన్స్... కొన్ని సినిమాలోని సీన్స్ ను పోలి ఉండటం. ఇదిలా ఉంటే మన టాలీవుడ్ నటసింహం బాలయ్యను కూడా షారుఖ్ కాపీ కొట్టాడంటూ... మీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
రికార్డ్స్ బ్రేక్...: బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తన సినిమాలతో టాప్ స్టార్ గా ట్యాగ్ వచ్చేలా ఎదిగాడు. బహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాలీవుడ్ పని అయిపోయింది అని అంతా అనుకున్న సమయంలో షారుఖ్ ఖాన్.. పఠాన్ సినిమాతో బాలీవుడ్ ను మళ్లీ నిలబెట్టాడు. ఇక పఠాన్ ఎంట్రీతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ అన్ని బ్రేక్ అయ్యాయి. ఇక పఠాన్ తర్వాత షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమా జవాన్.

ట్రోలింగ్స్...: తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. దానికి సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. ట్రైలర్ గురించి చెప్పాలంటే గూస్‌బంప్స్ అంతే. అట్లీ యాక్షన్ మార్క్ ట్రైలర్ లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ పై పలు ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే.. ఈ ట్రైలర్ లోని సీన్స్, వేషాధారణ.. పలు సినిమాల్లోని సీన్స్ ను, క్యారెక్టర్స్ పోలీ ఉండటం.
ఈ సీన్స్ కూడా ....: నిన్న మొన్నటి వరకు ట్రైలర్ లో కొన్ని సీన్స్ గమనిస్తే... బహుబలి2లో బిడ్డను ఎత్తిచూపే సీన్, విక్రమ్ అపరిచితుడు సీన్, డార్క్ మ్యాన్ సీన్, రజినీ కాంత్ శివాజి, అజిత్ వాలిమై సీనిమాల్లోని సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్.. మన టాలీవుడ్ నటసింహం బాలయ్యను కాపీ కొట్టాడని.. ఎక్కడ అని ఆలోచిస్తున్నారా...

ఆ సీన్ సేమ్ టు సేమ్...: బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇక ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఈ టీజర్ చివరలో.. ట్రైన్లో ఓ సాంగ్ పాడుతూ బాలయ్య విజిల్ వేస్తూ ఉంటాడు. ఆ క్లిప్స్ చూస్తే... సేమ్ టు సేమ్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ట్రైలర్ లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు సీన్స్ కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాపీ కొట్టి షారుఖ్...: కింగ్ ఖాన్ షారుఖ్... బాలయ్య యాటిట్యూట్ ను కాపీ కొట్టారంటూ.. బాలయ్య అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా జవాన్ ప్రీ టీజర్ వీడియో చివర్లో షారుక్ ఖాన్ ఏఎన్ఆర్ డాక్టర్ చక్రవర్తి సినిమాలోని ఈ మౌనం ఈ బిడియం సాంగ్ ప్లే అవుతూ ఉండగా స్టెప్స్ వేస్తాడు . భగవంత్ కేసరి సినిమా టీజర్ లోను చివర్లో విజిల్ వేస్తూ బాలయ్య స్మైల్ ఇవ్వడం తర్వాత ఫుల్ జోష్ తో గిటార్ ప్లే చేస్తూ ఫ్యాన్సుకి కొత్త ఉత్సాహం ఇస్తారు. అయితే ఇదే వీడియోస్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











