NTR: ఎన్టీఆర్ మూవీలో యానిమల్ స్టార్.. ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశారుగా..!
NTR -Neel: ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. వరుసగా భారీ సినిమాలను లైనప్ చేసుకుంటూ తన కెరీర్‌ను కొత్త దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు. దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో తారక్ ఫ్యాన్స్ ఉత్సాహానికి కూడా కొదవలేదు. అయితే, వార్ 2 సినిమా అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్-నీల్ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ ఏర్పడింది. ఈ పాన్ ఇండియా మూవీలో యానిమల్ స్టార్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ ఎవరు?
ఎన్టీఆర్ - అనిల్ కపూర్ కాంబోలో తెరకెక్కిబోతున్న 'డ్రాగన్'అనే టైటిల్ పరిశీలనలో ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ ఎంపిక కాగా, మలయాళ నటుడు టోవినో థామస్, తెలుగు నటుడు ప్రియదర్శి కూడా ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రిషబ్ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు హైప్‌ను మరింత పెంచుతున్నాయి. స్టార్ కాస్టింగ్‌తో పాటు స్క్రిప్ట్ స్కేల్ కూడా భారీదిగా ఉండడంతో ఈ చిత్రం ఇండియన్ సినిమాలో మరో మైలురాయిగా నిలవబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రాగన్ కథపై కూడా ఆసక్తికరమైన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. 1950-60 కాలంలోని గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యం ఈ కథకు ఆధారమని ప్రచారం. ఇండియా, బర్మా, థాయిలాండ్, లావోస్ సరిహద్దుల్లో డ్రగ్ రాకెట్‌లు ఎలా పనిచేశాయి? మాఫియా నెట్‌వర్క్‌లోకి ఒక సామాన్య వ్యక్తి ఎలా ప్రవేశించి, ఎలా లీడర్‌గా ఎదిగాడు? అన్నదే స్టోరీ హైలైట్ అని టాక్. రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, అంతర్జాతీయ నేరాలు కలిపి పవర్‌ఫుల్ మాఫియా కథను ప్రశాంత్ నీల్ తన మార్క్ స్టైల్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ కథకు తగ్గట్టే ఎన్టీఆర్ లుక్ కూడా హెవీ ఇంటెన్సిటీతో ఉండేలా డిజైన్ అవుతోంది.
ఈ సినిమాలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది కెమియో కాదు, కథను ప్రభావవంతం చేసే పాత్ర అని ఫిల్మ్ సర్కిల్స్ టాక్. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో ప్రశాంత్ నీల్ రూపొందించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రేక్షకులు చూశారు. అదే తరహా రా టోన్‌లో, ఇంటెలిజెన్స్, మాఫియా ప్రపంచంతో ముడిపడిన బ్యాక్‌డ్రాప్ ఉన్న రోల్‌లో అనిల్ కపూర్ కనిపించే అవకాశాలున్నాయి. ఆయన ప్రెజెన్స్ సినిమాకు స్ట్రాంగ్ పాన్-ఇండియా కనెక్ట్‌ను తెస్తుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ ఉన్న లుక్ సోషల్ మీడియాలో పెద్దగా చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం చాలా స్లిమ్‌గా కనిపించిన తారక్, ప్రస్తుతం మళ్లీ బల్క్ లుక్‌తో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ గుబురు గడ్డంతో, హెవీ మెన్లుక్‌తో ఫ్యాన్‌బేస్‌ను ఫిదా చేశారు. ఇది చూస్తుంటే 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ .. బాడీ ట్రాన్స్ పర్మేషన్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా.. ఈ మూవీ ఆగిపోయిందని గత కొన్ని వారాలుగా వచ్చిన రూమర్లను యూనిట్ పూర్తిగా ఖండించింది. సినిమా షూటింగ్ యథావిధిగా కొనసాగుతుందని, నవంబర్ చివరలో యూరప్‌లో కీలక షెడ్యూల్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన యాక్షన్ సీన్లు, భావోద్వేగ భరితమైన ముఖ్యమైన భాగాలు చిత్రీకరించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 2026లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్‌గెస్ట్ యాక్షన్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని ప్రసారం. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ స్కేల్ ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు వేసుకున్నారు. బజ్ ప్రకారం.. సోర్టీ, ఎన్టీఆర్ లుక్, టెక్నికల్ టీమ్... అన్నింటి పరంగా 'డ్రాగన్' కంటెంట్ ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్.. ఈ మూవీతో సూపర్‌కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











