ఏంటి నయనతార అలా చేసిందా?... ఆమె భర్తకు షారుక్ వార్నింగ్!.. సల్మాన్ కూడా రియాక్ట్

హీరోయిన్ నయనతార ను ఉద్దేశిస్తూ బాలీవుడ్ స్టార్ హీరో బాద్ షా షారుక్ ఖాన్ ఓ షాకింగ్ ట్వీట్ పెట్టారు. ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ కు ఓ చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు! ప్రస్తుతం అది సోషల్ మీడియాలో పుల్ ట్రెండ్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన 'జవాన్‌' సినిమా రీసెంట్ గా రిలీజైంది మంచి స్పందనను అందుకుంది. అభిమానులకు మంచి యాక్షన్ కిక్ ఇచ్చింది. బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ ప్రచార చిత్రం బాగుందని అంటున్నారు. ఈ క్రమంలోనే నయనతార భర్త దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కూడా ప్రచార చిత్రాన్ని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రివ్యూ వీడియో అద్భుతంగా ఉందని, తనకెంతో నచ్చిందని పోస్ట్‌ పెట్టారు.

Bollywood Shahrukh Khan Asks Vignesh Shivan to be a beware of nayanthara news viral in social media

విఘ్నేశ్ హ్యాపీ ఫీల్ నోట్: ఇటువంటి బడ్డా సినిమాతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. ట్రైలర్‌ ఇంటర్నేషనల్ రేంజ్ లో సూపర్ గా ఉంది. షారుక్ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టాలనే నా భార్య నయన్‌ డ్రీమ్ నెరవేరింది. మూవీ టీమ్ మొత్తానికి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు అని విఘ్నేశ్‌ రాసుకొచ్చారు.

Bollywood Shahrukh Khan Asks Vignesh Shivan to be a beware of nayanthara news viral in social media

షారుక్ స్వీట్ వార్నింగ్: ఈ ట్వీట్ చూసి షారుక్ ఖాన్ స్పందించారు. 'విఘ్నేశ్‌.. మా చిత్రంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నయనతర ఓ అద్భుతమైన వ్యక్తి. ఇప్పటికే ఈ విషయం మీకు తెలుసు కదా. రీసెంట్ గా ఆమె కొన్ని కీలకమైన పంచ్‌లు స్పెషల్ గా నేర్చుకుంది. కాబట్టి బీ కేర్ ఫుల్' అని సరదాగా ఓ స్మాల్ వార్నింగ్ ఇచ్చారు.

Bollywood Shahrukh Khan Asks Vignesh Shivan to be a beware of nayanthara news viral in social media

సల్మాన్ రియాక్షన్: అలానే ఈ ఈ జవాన్ ట్రైలర్ పై బాలీవుడ్ భాయ్ సల్మాన్‌ఖాన్‌ కూడా ప్రశంసించారు. 'పఠాన్‌.. జవాన్‌గా మారిపోయారు. ట్రైలర్‌ అద్బతం. నాకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలను తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. మొదటి రోజు నేను ఈ చిత్రాన్ని చూస్తాను' అని రాసుకొచ్చారు.

Bollywood Shahrukh Khan Asks Vignesh Shivan to be a beware of nayanthara news viral in social media

ఆ రోజే గ్రాండ్ గా రిలీజ్: 'పఠాన్‌' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత షారుక్ నటిస్తోన్న చిత్రమే 'జవాన్‌'. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. నయనతార స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. విజయ్‌ సేతుపతి బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో అదిరిపోయే యాక్షన్ రోల్ నటించింది. ప్రియమణి మరో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. సెప్టెంబర్‌ 10న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X