మొగుడు మీద రచ్చ చేసి.. ఇప్పుడు మళ్లీ కలిసిపోయిన అలియా.. ఇదెక్కడి ట్విస్ట్?

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ యాక్టర్ తెలుగులో వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ఇక ఈ నటుడు తన భార్యతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అంతేనా అలియా సైతం భర్త మీద కోర్టుకు ఎక్కి మరీ కేసులు పెట్టింది. ఏమైందో తెలియదు.. మళ్లీ వీరు కలిసిపోయారట. ఇంత రచ్చ చేసి మళ్లీ కలిసిపోవడానికి కారణం ఏంటి.. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సైంధవ్ తో తెలుగులోకి...:ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఆయన ఇటీవల వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో నటించి ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. ఆయన సైంధవ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.

Bollywood Star Actor Nawazuddin Siddiqui Patches Up With His Wife Aaliya News Goes Viral

నటనకు ప్రశంసలు...:ఇక తెలుగులో మొదటి సినిమానే నవాజుద్దీన్ కు చుక్కెదురు అయింది. అయినప్పటికీ ఆయన నటనకు మంచి మార్కులు వచ్చాయి. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. భార్య ఆలియాతో ఆయన విడిపోయారని వార్తలు వచ్చాయి. భార్యతో ఉన్న గొడవలతో కూడా వార్తల్లో నిలిచేవారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ తనను వేధిస్తున్నారని.. ఆయన తల్లి ఇంట్లో నుంచి తనను, తన పిల్లలను గెట్టేశారని ఆరోపిస్తూ ఆలియా అప్పట్లో ఓ వీడియో రిలీజ్ చేయగా సెన్సేషన్ అయింది.

మొగుడిపై రచ్చ చేసి..:అలియా తన భర్త మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి సంచలన సృష్టించింది. దీంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఆ మధ్య మీడియాలో మారుమోగిపోయింది. ఆ తరవాత నవాజుద్దీన్ కూడా స్పందించి... ఆలియాతో తాను విడాకులు తీసుకొని చాలా కాలమే అయ్యిందని.. పిల్లల కోసం తామిద్దరం ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పుకువచ్చాడు. తన పిల్లల జీవనం, చదువు కోసం ఆలియాకు బోలెడంత డబ్బు ఇస్తున్నానని అయినా ఆమె కావాలనే ఇలా చేస్తుందని వివరించాడు.

ఇప్పుడు మళ్లీ కలిసిపోయి...:అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ మీద పలు ఆరోపణలు,కేసులు, కోర్టుకెక్కిన భార్య అలియా.. ఇప్పుడు సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. భర్తతో విడిపోయిన అలీయా తాజాగా మళ్లీ కలిసి జీవిస్తుందని తెలుస్తోంది. అయితే తాజాగా అందిన సమాచారం ఏంటంటే.. ఈ జంట మరోసారి జతకట్టిందట. ఆలియా తన పిల్లలతో తిరిగి తన భర్త నవాజుద్ధీన్ సిద్ధికి వద్దకు వెళ్లిపోయిందని ముంబై మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ స్నాప్‌లను కూడా పోస్ట్ చేసింది.

Bollywood Star Actor Nawazuddin Siddiqui Patches Up With His Wife Aaliya News Goes Viral

ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ముంబై నడిబొడ్డున 50 కోట్లతో బంగ్లా కట్టి వార్తల్లో నిలిచాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులో పెద్ద ఫ్లాప్ అయిన వెంకటేష్ సైంధవ్ లో అతను చివరిగా కనిపించాడు. పలు ప్రాజెక్టులతో నవాజుద్దీన్ బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X