twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూనియర్ ఎన్టీఆర్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్ సీనియర్ దర్శకుడు.. సెట్టయితే మామూలుగా ఉండదు

    |

    ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు ఎక్కువగా ఇతర ఇండస్ట్రీలో వైపు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా కనిపిస్తూ ఉండేవారు. తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో మంచి టాలెంటెడ్ నటులు ఉన్నప్పటికీ కూడా వారితో సినిమాలు చేయాలని అంతగా ఆలోచించ లేదు. కానీ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా అందరి ఆలోచన విధానం మారిపోయింది. ప్రస్తుతం టాలెంట్ అనేది చాలా ముఖ్యం అని అందరి టెక్నీషియన్లకు అర్థమవుతోంది. ముఖ్యంగా దర్శకులు మాత్రం మంచి టాలెంట్ ఉన్న హీరోల కోసం వెతుకుతున్నారు అనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా అన్ని భాషల దర్శకులు స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు.

    మన హీరోలు ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన కథలను పై ఫోకస్ చేస్తున్నారు. కథ నచ్చితే దర్శకుడు ఏ భాష వారు అని కూడా చూడటం లేదు. దర్శకుడు తెరకెక్కించ గలడు అని ఒక నమ్మకం ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక బాలీవుడ్ బడా దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే RRR సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    Bollywood star director Sanjay Leela Bhansali focusing on jr ntr

    బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ ఆల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటన పై ఇదివరకే బాలీవుడ్ అగ్ర దర్శకులకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా బాలీవుడ్ సీనియర్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బాజీరావ్ మస్తానీ పద్మావత్ వంటి ఎన్నో చారిత్రాత్మక కథలను టచ్ చేసిన సంజయ్ ప్రస్తుతం గంగు భాయ్ కథియావాడి సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో అలియాభట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

    ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తోనే సంజయ్ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక మరో హీరో పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా తన తదుపరి ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాడట. మొదట రామ్ చరణ్ అని ఒక టాక్ అయితే వచ్చింది. RRR హీరోల లోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ పై పడినట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Bollywood star director Sanjay Leela Bhansali focusing on jr ntr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X