Pushpa 2: సుక్కు ప్లాన్ సూపర్.. పుష్ప2లో బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్ క్యామియో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం పుప్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాను అందరి అంచనాలకు తగ్గట్లుగా తెచ్చేందుకు డైరెక్టర్ సుకుమార్ చాలానే కష్టపడుతున్నారు. అయితే సినిమా రేంజ్ ను మరింత పెంచేందుకు.. మరో క్రేజీ బాలీవుడ్ స్టార్ హీరోను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరు, ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే నీ యవ్వా అంటూ వచ్చి అందరి మనసుల్లో నిలిచిపోయాడు అల్లు అర్జున్. ముఖ్యంగా ఇప్పటికీ ఈ డైలాగ్ ను వేలాది మంది వాడుతున్నారు. అలాగే పుష్పరాజ్ మ్యానరిజాన్ని కూడా చూపిస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సినిమా విడుదల అయి రెండేళ్లు అవుతున్నా ఆ సినిమా క్రేజ్ తగ్గట్లేదంటేనే ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవాలి. ఇలా సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. ఇదంతా అందరికీ తెలిసిందే కాగా.. ఈ సినిమా కోసం చాలా మంది ఈగర్ గా వేచి చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ గురించి, దానికోసం సుకుమార్ చేస్తున్న ఖర్చు గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రేంజ్ ను పెంచేందుకు... డైరెక్టర్ సుకుమార్ ఓ బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోలి దించుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నట్లు చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. అనసూయ పాత్రను కూడా మరింత పెంచి మ్యాజిక్ చేయబోతున్నారట. ఇదంతా ఉలా ఉండగా.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోను ఈ సినిమాలోకి తీసుకు వస్తున్నారట. అయితే ఈయన మరెవరో కాదు స్టార్ హీరో సంజయ్ దత్. ఈయన్ను తీసుకు వచ్చి ఈ సినిమాలో అతిథి పాత్ర చేయించాలని సుకుమార్ చూస్తున్నారట. దీనికోసం ఇప్పటికే సంజయ్ దత్ ను సంప్రదించగా.. ఆయన కూడా ఓకే చెప్పారట.

త్వరలోనే సంజయ్ దత్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి బాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో నిజంగానే నటించబోతున్నారా.. నటిస్తే ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











