Pushpa The Rule: పుష్ప 2లో మరో స్టార్ హీరో.. పఠాన్‌ మూవీలా ప్లాన్.. ఆ సీన్ ఎప్పుడు వస్తుందంటే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా బడా హీరోగా వెలుగొందుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అంతేకాదు, ఈ దెబ్బతో తన రేంజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసమే!

పాన్ ఇండియాపై ప్రభావం : అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. దీనికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. మొత్తంగా పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు.

Pushpa The Rule Movie

పుష్పరాజ్ రూల్‌ చేసేలానే : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో.. రెండో పార్టుపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీనిక 'పుష్ప.. ది రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారని సమాచారం.

Pushpa The Rule Movie

యమ స్పీడుగానే షూటింగ్ : 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్‌కు క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో తెలిసిందే. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలెట్టారు. ఇలా ఇప్పటికే చాలా భాగం పూర్తైంది. ఇలా దాదాపు 30 శాతానికి పైగానే షూటింగ్ కూడా పూర్తైందనే టాక్ వినిపిస్తోంది.

భారీ రెస్పాన్స్... రెట్టింపుగా
'పుష్ప ది రూల్' కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా అత్యధిక వ్యూస్‌తో ఇది రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అంచనాలను రెట్టింపు చేసింది.

Pushpa The Rule Movie

పుష్ప 2లో మరో స్టార్ హీరో
'పుష్ప ది రూల్' మూవీలో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలిసింది. అతడు ఎవరో తెలియలేదు కానీ.. సుకుమార్ మాత్రం డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడంటే : 'పుష్ప ది రూల్' మూవీ రేంజ్‌ను మరింతగా పెంచడం కోసమే బాలీవుడ్ స్టార్ హీరోతో గెస్ట్ రోల్ చేయించాలని సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇక, ఈ పాత్ర ఐదు నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. ప్రీ క్లైమాక్స్ సమయంలో వచ్చి అల్లు అర్జున్ పాత్రకు సహాయం చేసేలా ఈ గెస్ట్ రోల్‌ను డిజైన్ చేశారట. దీంతో ఇది ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X