Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 9 ఏళ్ళ తరువాత తెలుగు హీరోతో
రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే రాధేశ్యామ్ తరువాత రెబల్ స్టార్ తన స్పీడ్ ను మరింత పెంచనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో బిగ్ బడ్జెట్ సినిమా సలార్ ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. హీరోయిన్ గా శృతి హసన్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెతో పాటు మరొక హాట్ బ్యూటీని కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కొత్త రూమర్ వైరల్..
ఎంత క్లారిటీ ఇస్తున్నా కూడా సలార్ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో నటించే పాత్రలకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరొక కొత్త రూమర్ వైరల్ అయ్యింది.
మెయిన్ హీరోయిన్..
సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయంలో చాలా రోజులుగా రుమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట దిశా పటాని, కీయరా అద్వానీ, కత్రినా కైఫ్ అంటూ కథనాలు చాలానే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్రభాస్ జోడిగా సీనియర్ స్టార్ హీరో కూతురిని సెలెక్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. మొన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
సాంగ్ కోసం ప్రియాంక చోప్రా
మొత్తానికి సలార్ మహారాణి శృతి హాసన్ అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆమెతో పాటు మరొక బాలీవుడ్ బ్యూటీ సినిమాలో కనిపించనుందట. కానీ క్యారెక్టర్ తో కాదు. ఐటెమ్ సాంగ్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ప్రియాంక చోప్రా ప్రభాస్ తో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా టాక్ వస్తోంది.
మళ్ళీ 9 ఏళ్ళ తరువాత
ప్రియాంక చోప్రా చివరగా 2013లో తెలుగులో రామ్ చరణ్ కలిసి జంజీర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక ఆ తరువాత ఆమె సౌత్ వైపు తిరిగి చూడలేదు. ఇక మళ్ళీ 9 ఏళ్ళ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా ద్వారా సౌత్ కు సంబంధించిన పాన్ ఇండియా సినిమాలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.