twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు హిస్టారికల్ మూవీ.. రాజమౌళి సినిమా కంటే భారీగా, హింట్ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా టచ్ చేయడం లేదు. ఏదైనా సరే కొత్తగా ఉండాలని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక మళ్ళీ హిస్టారికల్ కథలను అలాగే పౌరాణిక అంశాలను ఆధారంగా చేసుకొని సినిమాలను చేస్తున్నారు. మహేష్ బాబు కూడా భవిష్యత్తులో రాముడిగా కనిపించే అవకాశం ఉందని గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఒక సీనియర్ నిర్మాత కూడా ఒక వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది.

    రాముడిగా ప్రభాస్..

    రాముడిగా ప్రభాస్..

    ప్రస్తుతం రామాయణం కథ ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనోన్ నటిస్తోంది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ను కనిపించనున్నాడు. దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమగా రూపొందిస్తున్నారు.

    రామాయణ బ్యాక్ డ్రాప్ లో మహేష్

    రామాయణ బ్యాక్ డ్రాప్ లో మహేష్

    ఇక మహేష్ బాబు కూడా రాముడి పాత్రలో నటించనున్నట్లు గత రెండేళ్లుగా టాక్ వస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాత మధు మంతెన వర్మ.. రామాయణ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. స్క్రిప్ట్ పనులు ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయట. అయితే ఆ మధ్య మహేష్ బాబు, హృతిక్ రోషన్ వంటి వారు సినిమాలో నటిస్తారని టాక్ వచ్చింది.

    మహేష్ టచ్ లో ఉన్నాడు

    మహేష్ టచ్ లో ఉన్నాడు

    శ్రీరాముడి పాత్ర కోసం అయితే నిర్మాత ఒక స్టార్ హీరోను అనుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు సైతం టచ్ లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. అయితే సినిమా చేయడానికి మహేష్ బాబు ఒప్పుకున్నాడా లేదా అనే విషయాన్ని చెప్పలేదు. మహేష్ అయితే ఇంతవరకు ఆ సినిమాపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని సమాచారం.

    మహేష్ చేయబోయే సినిమాలు

    మహేష్ చేయబోయే సినిమాలు

    ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ త్వరలోనే త్రివిక్రమ్ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నారు. అలాగే రాజమౌళితో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితో చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే రామాయణ సినిమాపై కూడా మహేష్ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.

    English summary
    Top heroes in the Tollywood film industry are not touching much of the regular commercial movies these days. Careful steps are taken to keep anything new. Again, they are making films based on historical stories as well as mythological elements. There have been various rumors circulating for some time now that Mahesh Babu may also appear as Ramudi in the future. And recently even a senior producer has gone viral giving an explanation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X