ప్రభాస్‌కు పోటీ ఇవ్వాలంటే మహేష్ మాత్రమే రావాలి.. బాలీవుడ్ నిర్మాత డేరింగ్ స్టెప్!
ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సాహో సినిమా ఆ స్థాయిలో హిట్ కాకపోయినప్పటికి రెబల్ స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా మంది అగ్ర దర్శకులు నిర్మాతలు అతనితో పాన్ ఇండియా సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇటీవల ఒక బడా నిర్మాత ప్రభాస్ సినిమాకు పోటీగా మరో సినిమాను నిర్మిస్తూ అందులోకి ఎలాగైనా మహేష్ బాబును తీసుకురావాలని అనుకుంటున్నాడు.
పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్

మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాతలు మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏది వర్కౌట్ అవ్వడం లేదు. మహేష్ కూడా రిస్క్ లాగా కాకుండా హిట్టు గ్యారెంటీ అనేలా కథ చెబితేనే సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

ఎప్పటి నుంచో ప్లానింగ్
ఇక ఇటీవల బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన, మహేష్ బాబుతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. మహేష్ కూడా చాలా కాలంగా ఆయనతో ఒక పెద్ద సినిమా చేయాలని మాట కూడా ఇచ్చేశారు. కమిట్మెంట్ అయితే కొనసాగుతోంది గాని కథ మాత్రం ఫైనల్ కావడం లేదు. ఇక ఇటీవల మధు ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేయాలని చూస్తున్నారట.

ఆ హీరో తప్పుకోవడంతో
రామాయణం కథను 3D లో నిర్మించాలని మధు గత మూడేళ్ళ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. రాముడిగా హృతిక్ రోషన్ ను సెలెక్ట్ చేసి, సీత పాత్ర కోసం దీపిక పదుకొనెను ఫైనల్ చేయాలని అనుకున్నారు. అయితే సడన్ గా హృతిక్ రోషన్ తప్పుకోవడంతో రాముడి పాత్ర కోసం మహేష్ ను రప్పించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

మహేష్ క్లిక్కయితే..
నిజానికి ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందే మధు మంతేనా రామాయణం 3D ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్య్ చేశాడు. ఇక సడన్ గా ఓం రావత్ ప్రభాస్ తో రామాయణం కథను స్టార్ట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో నిర్మాత మధు మహేష్ ను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. మహేష్ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మామూలుగా ఉండవని ప్రభాస్ సినిమాకు ధీటుగా ఉండాలంటే మహేష్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











