రామ్ చరణ్ కోసం ఇద్దరు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు వెయిటింగ్.. ఎవరు వాళ్లు? చెర్రీ రిప్లై ఏంటీ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎలాంటి బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారో తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత నుంచి గ్లోబల్ స్టార్ గానూ కీర్తి పొందుతున్నారు. ఆ మూవీలో మెగా పవర్ స్టార్ పెర్ఫామెన్స్ కు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు దక్కాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చరణ్ నటనకు మంచి మార్కులు వేసిన సంగతి తెలిసిందే. దాంతో చరణ్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రేజీ లైనప్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా ఉన్నారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ బాలీవుడ్ ఫిల్మ్ పైనా ఆసక్తి నెలకొంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత నుంచి ప్రముఖ నిర్మాతలు రామ్ చరణ్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ చరణ్ బిజీగా షెడ్యూల్ వల్ల అది సెట్ కావడం లేదు. ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్లు ఎవరు? చరణ్ వారి ప్రాజెక్ట్ కు ఎలా బదులిచ్చాడనే దానిపై సమాచారం అందింది. బాలీవుడ్ లో రామ్ చరణ్ ఫోన్ కాల్ కోసం ఇద్దరు అగ్ర నిర్మాతలు వేచి చూస్తున్నారని తెలుస్తోంది. వాళ్లేవరో కాదు టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, మధు మంటెనా కావడం విశేషం. వీరిద్దరూ సంయుక్తంగా ఓ బిగ్ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో నిర్మించడానికి చాలా వెయిట్ చేస్తున్నారు.

Bollywood star Producer Waiting for Ram Charan Here is the Mastar plan for Global Star

రామ్ చరణ్ నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలు.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ గురించిన పనులను చకాచకా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సాలిడ్ కథలను కూడా విన్నారని తెలుస్తోంది. ఆ స్టోరీని డైరెక్ట్ చేసేందుకు సరైన డైరెక్టర్ ను కూడా చూసే పనిలో ఉన్నారంట. అయితే చరణ్ స్పందిస్తే మిగితా పనులు స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే చరణ్ ఆ ప్రొడ్యూసర్లకు సినిమా చేస్తానని హామీనిచ్చారంట. సరైన కథ, డైరెక్టర్ సెట్ అయితే తను సిద్ధమేనని కమిట్ మెంట్ ఇచ్చారంట. ఇప్పుడు ఆ మాటకోసమే ఇద్దరు ప్రొడ్యూసర్లు బాలీవుడ్ లో రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇక గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లోకి 'జంజీర్' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాలీవుడ్ తో చరణ్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత నుంచి మరింతగా బలపడ్డాయి. సల్మాన్ ఖాన్ తో చరణ్ ఎంత క్లోజ్ గా ఉంటారో తెలిసిందే. చరణ్ కోసం బాయ్ జాన్ 'గాడ్ ఫాదర్'లో క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లోనూ అదరగొట్టాడు. అలాగే 'కిసి కా జాన్ కిసి కా బాయ్' చిత్ర ప్రమోషన్స్ లోనూ సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ ను బాలీవుడ్ లో సందడి చేసి ఆకట్టుకున్నారు.

Take a Poll

ఈ క్రమంలో బాలీవుడ్ లో చరణ్ చేయబోయే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. చివరిగా 'గేమ్ ఛేంజర్'తో అలరించిన రామ్ చరణ్ నెక్ట్స్ 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఆర్సీ16'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ17లోనూ నటిస్తున్నారు. అలాగే లోకేష్ కగనరాజ్ తోనూ ఓ ఫిల్మ్ ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: ram charan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X