టాలీవుడ్ పై రణబీర్ కపూర్ కన్ను.. బాలీవుడ్ స్టార్ ప్లాన్ ఏంటంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్ర్తం'తో తెలుగు ఆడియెన్స్ కు భారీ ఎత్తున్న పరిచయం అయిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆయన సినిమాలు తెలుగులో వెర్షన్ లో వచ్చి ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి ఆయనను ఇష్టపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. 'బ్రహ్మస్త్రం' మూవీ రిలీజ్ సందర్బంగా తెలుగు స్టేట్స్ లో ఇక్కడి హీరో మాదిరిగానే ప్రమోషన్స్ నిర్వహించారు. మన దర్శక నిర్మాతలు, మన స్టార్ హీరోలను ఎంతో గౌరవించారు. మర్యాద చూపిస్తూనే మన హీరోలపై ఉన్న ప్రేమనూ వ్యక్తం చేశారు. దీంతో అప్రయత్నంగానే రణబీర్ తెలుగు ప్రేక్షకులకూ ఎంతగానో దగ్గరయ్యారు.

ఇక ఇప్పుడు రణబీర్ కపూర్ ఏకంగా తెలుగు ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం తెలుగు రైటర్స్, దర్శకులు, నిర్మాతల పేర్లు ఆల్ ఓవర్ ఇండియా గట్టిగానే వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ ఏ రేజ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారో తెలిసిందే. ఈ క్రమంలో ఆ దర్శక నిర్మాతలతో సినిమాలను చూసే స్టార్ల సంఖ్య కూడాపెరిగిపోతోంది. మరోవైపు డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేసేందుకు కూడా ఇతర భాషల్లోని స్టార్స్ ఏమాత్రం సంకోచించడం లేదు. ఇప్పటికే విజయ్ దళపతి, ధనుష్ వంటి స్టార్ హీరోలు స్ట్రేట్ తెలుగు ఫిల్మ్ చేసి హిట్లు అందుకున్న సంగతి తెలిపిందే.

Bollywood Star Ranbir Kapoor planning to do Direct Telugu Movie

ఈ తరుణంలోనే ఫిల్మ్ సర్కిల్ లో ఓ గాసిప్ గట్టిగానే వినిపిస్తోంది. మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో 'యానిమల్' చిత్రం చేసిన రణబీర్ కపూర్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. తెలుగులో ఓ క్రేజీ డైరెక్టర్ అంటూ కూడా గుసగుసలు. పైగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ కంపెనీ 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' బ్యానర్ లో నే ఈ చిత్రం రాబోతుందని అంటున్నారు. కానీ ఎలాంటి అఫీషియల్ న్యూస్ మాత్రం లేదు. నిజమైతే మాత్రం.. దర్శకుడు ఎవరు? ఎలాంటి కథ చేయబోతున్నారనేది ఆసక్తిని నెలకొల్పోతోంది.

ఇక రణబీర్ కపూర్ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'యానిమల్' చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ లవర్ బాయ్ పేరున్న రణబీర్ ను సందీప్ రెడ్డి ఏ రేంజ్ వయలెన్స్ తో చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు రణబీర్ నటనకూ కూడా భారీ స్పందన వచ్చింది. విమర్శలతో థియేటర్లలోకి వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మాస్టర్ పీస్ గా నిలిచిందీ చిత్రం. ఇలాంటి జోనర్ తర్వాత రణబీర్ ఎలాంటి సినిమా చేస్తారనే ఆసక్తి తన అభిమానుల్లో నెలకొంది.

Bollywood Star Ranbir Kapoor planning to do Direct Telugu Movie

ఇక నెక్ట్స్ రణబీర్ రెండు భారీ చిత్రాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామయణ : పార్ట్ 1 షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే లవ్ అండ్ వార్ సినిమా కూడా చిత్రీకరణ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ రెండ్ చిత్రాలు 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయని అంటున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X