Viswambhara: చిరంజీవి సినిమాలో పాన్ ఇండియా స్టార్.. రికార్డులు గల్లంతు అవడం ఖాయం
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూనే చిరంజీవి ముందుకు సాగుతున్నారు.
రీఎంట్రీలో ఫుల్ స్పీడుగా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. కొద్ది రోజుల క్రితమే 'భోళా శంకర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం డిజాస్టర్ అవడంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన 'బింబిసార' మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను సైతం జరిపారు. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టి.. ఓ షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు.
క్రేజీ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఇప్పుడు ఈ మూవీలో అత్యంత కీలకమైన పాత్ర కోసం ఓ పాన్ ఇండియా స్టార్‌ను ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన ఓ పాన్ ఇండియా రేంజ్ హీరోను తీసుకున్నారని తెలిసింది. అయితే, ఆ స్టార్ ఎవరన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే ఆయన రోల్ ఈ చిత్రంలో ట్విస్టులాగా ఉంటుందట. అందుకే ఈ హీరో పేరును సస్పెన్స్‌గా ఉంచబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో వస్తున్న ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











