బాలీవుడ్‌లో మరో సూపర్ హిట్ సౌత్ మూవీ రీమేక్.. స్టార్ హీరో పాత్రలోకి సల్మాన్ ఖాన్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో సౌత్‌లో బ్రహ్మండంగా కలెక్షన్లను సాధించిన మరో సినిమాను రీమేక్ చేసే ఆలోచనల్లో సల్మాన్ ఖాన్ ఉన్నట్టు సమాచారం. ఆ సినిమా ఏమిటి? రీమేక్ వార్త నిజమేనా అనే విషయాల్లోకి వెళితే...
అరబిక్ సుందరిగా మారిన అదా శర్మ... అందంతో ఆకర్షిస్తూ...

మాస్టర్ రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు
లాక్‌డౌన్ ఎత్తివేసి థియేటర్ల ఓపెన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత దక్షిణాదిలో రిలీజైన చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో ఇళయ దళపతి విజయ్, సెన్సేషనల్ హీరో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది.

హిందీలోకి మాస్టర్ రీమేక్
అయితే దక్షిణాదిలో మంచి విజయాన్ని అందుకొన్న మాస్టర్ చిత్రంలో విజయ్ పోషించిన పాత్రను సల్మాన్ ఖాన్‌తో చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కబీర్ సింగ్ నిర్మాత మురాద్ ఖేతాని, బిగ్‌బాస్ షో ను నిర్మించే ఎండెమాల్ షైన్ నిర్వాహకులు ఇటీవల సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినట్టు సమాచారం.

విజయ్ పాత్రలో సల్మాన్ ఖాన్
మాస్టర్ చిత్రంలో విజయ్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్‌ను, అలాగే భవానీగా విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి రోల్‌ను మరో ప్రముఖ హీరోతో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సల్మాన్‌తో నిర్మాతలు గత నెల రోజుల్లో పలుమార్లు కలిసి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

మార్పులు చేయమని సల్మాన్ ఖాన్ సూచన
అయితే మురాద్ ఖేతాని, ఎండెమాల్ షైన్ నిర్మాతల ప్రతిపాదనకు సానుకూలంగా సల్మాన్ స్పందించారు. అయితే హిందీ వెర్షన్‌కు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్టుతో తన వద్దకు రావాలని సల్మాన్ ఖాన్ సూచించారు అని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేస్తే ఆలోచిద్దామని స్పష్టం చేసినట్టు సమాచారం.

సల్మాన్ ఖాన్ కెరీర్ ఇలా...
మాస్టర్ హిందీ రీమేక్ విషయంలో అంతా సవ్యంగా సాగితే... వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కబీ ఈద్ కభీ దీవాళీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే పలు చిత్రాల గురించి సల్మాన్‌తో పలువురు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











