60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కుతోన్న అమీర్‌ఖాన్? .. మూడో భార్య ఎవరో తెలుసా?
ఇటీవలికాలంలో సినీ ప్రముఖులకు సంబంధించి ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, విడాకుల మ్యాటర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పేరు ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది. కిరణ్ రావు నుంచి విడిపోయిన ఆయన మూడో పెళ్లికి సిద్ధమయ్యారని, త్వరలోనే మరో మహిళను తన జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో వీటికి బలం చేకూరుతోంది.
రొమాన్స్, కామెడీ, యాక్షన్, లవ్ ఇలా ఏ జోనర్ తీసుకున్నా అందులో అద్భుతంగా ఒదిగిపోగల నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర కోసం ఎంత కష్టానికైనా అమీర్ సిద్ధమే. మూడున్నర దశాబ్ధాలుగా బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరిగా, బాలీవుడ్‌కు ఐకాన్‌గా నిలిచారు అమీర్. భారతీయ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఇవి కాక ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అమీర్‌ఖాన్‌ను వరించాయి.

హీరోగానే కాకుండా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాతగా మారి ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతేడాది ఆయన నిర్మించిన లాపటా లేడీస్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న అమీర్ ఖాన్.. సితారే జమీన్ పర్, లాహోర్ 1947 సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే రీనా దత్తాను 1986లో పెళ్లాడారు అమీర్.. ఈ దంపతులకు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ సంతానం. అయితే పెళ్లయిన 16 ఏళ్లకు ఈ జంట విడాకులు తీసుకుని ఇండస్ట్రీకి షాకిచ్చింది.
రీనా దత్తాతో విడాకులు తర్వాత లగాన్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కిరణ్ రావుతో ప్రేమలో పడిన అమీర్‌ఖాన్ 2005లో ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ జంట సరోగసి విధానంలో ఆజాద్ అనే బాబుకి జన్మనిచ్చారు. అంతా సాఫీగా సాగుతున్న దశలో కిరణ్ రావు - అమీర్ ఖాన్ దంపతులు విడాకులు తీసుకుని మరోసారి షాకిచ్చారు. నాటి నుంచి అమీర్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారని.. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి.
గత కొద్దిరోజులుగా బెంగళూరుకు చెందిన ఓ మహిళను ఆయన మూడో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మీడియా మాత్రం అమీర్ పెళ్లి చేసుకుంటారని అంటున్న అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటీ అన్న వివరాలను ఆరా తీస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఆమె పేరు గౌరి అట. తన కుటుంబానికి అమీర్‌ను ఆమె పరిచయం చేయగా.. అమీర్ కూడా ఆమెను తన కుటుంబానికి ఇంట్రడ్యూస్ చేశారట. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని టాక్. అయితే తన మూడో పెళ్లిపై అమీర్ ఖాన్ కీలక ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ , సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే అమీర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్లే.


Click it and Unblock the Notifications











