Spirit: స్పిరిట్‌లో సీనియర్ హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్.. సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్ మూమూలుగా లేదుగా!
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. కాగా ఇప్పుడు ప్రభాస్ హీరోగా చేసే ప్రతి సినిమా తన దర్శకుడు వల్ల కాకుండా తన వల్ల అవి పాన్ ఇండియా సినిమాలుగా మారుతున్నాయి. మరి ఇలాంటి స్టార్ ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేస్తే దాని ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుంది.
అలా ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో కొత్త దర్శకులు అలాగే స్టార్ దర్శకులు కూడా ఉన్నారు. అయితే ఈ అందరిలో కూడా సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న సినిమాపై ఎనలేని హైప్ ఉంది. కాగా ఈ చిత్రమే "స్పిరిట్" కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు పాన్ సౌత్ భాషల్లో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రంకి సందీప్ రెడ్డి వంగ భారీ తారాగణంతో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది.

దీనితో ఇండియా సహా హాలీవుడ్ వరకు కూడా స్టార్ కాస్ట్ నటిస్తారని రూమర్స్ ఉన్నాయి. ఆ మధ్య కొరియన్ బాలయ్య డాన్ లీ నటిస్తాడని ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో మరో స్టార్ నటి కూడా ఉండబోతుంది అని టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. మరి ఆమెనే బాలీవుడ్ ఓల్డ్ అండ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ అట. ఈమెని సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో కీలక రోల్ కి డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఐతే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఈమె నటిస్తుందా లేక సినిమాలో వేరే రోల్ ని చేస్తుందా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతానికి నార్త్ టు సౌత్ సినీ వర్గాల్లో కూడా ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకే అన్నట్టు అంటున్నారు. మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ లో నిజంగానే సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

కాగా ఈ చిత్రంని సందీప్ రెడ్డి వంగ ఒక క్రేజీ అండ్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ ఈ చిత్రంతో మొట్ట మొదటిసారిగా పోలీస్ రోల్ లో చేయనున్నాడు. ఇక ఈ భారీ చిత్రం తాలూకా స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి అయ్యిపోయింది. ఇక ఈ ఏడాది చివరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
అలాగే వచ్చే ఏడాది చివరలో లేదా 2026 లో సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా సందీప్ క్లారిటీ ఇచ్చాడు. కాగా రీసెంట్ గా ప్రభాస్ కల్కి 2898 ఎడి సక్సెస్ తో ప్రభాస్ 1100 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టగా సందీప్ రెడ్డి వంగ తన అనిమల్ సినిమాలో 900 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది. మరి ఇలాంటి సెన్సేషనల్ కలయికలో వచ్చే సినిమా ఎలాంటి సంచలనం సెట్ చేస్తుందో ఊహిస్తేనే విధ్వంసంలా అనిపిస్తుంది. మరి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఎలాంటి వండర్స్ సెట్ చేస్తుందో ఆగి చూడాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











