twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MEB ఎఫెక్ట్.. బడా బ్యానర్ లోనే మరో ఛాన్స్ కొట్టేసిన బొమ్మరిల్లు భాస్కర్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బొమ్మరిల్లు భాస్కర్ నిన్న మొన్నటి వరకు ఎంతగానో టెన్షన్ లో ఉన్నాడు అనే చెప్పాలి. అతను మొదటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకున్నాయి. బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన భాస్కర్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో పరుగు అనే మరొక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు స్థాయిని ఒక్కసారిగా ఆకాశాన్ని దాటించేసాయి. పరుగు సినిమా తర్వాత భాస్కర్ కు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. అయితే అతను ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా తొందరపడకుండా కథను బట్టి ముందుకు వెళ్ళాడు. కొంతమంది అగ్ర నిర్మాతలు అతనికి భారీ స్థాయిలో అడ్వాన్సు ఇచ్చేందుకు కూడా సిద్ధం అయినప్పటికీ భాస్కర్ దాన్ని ఉపయోగించుకోలేదు.

    వీలైనంత వరకు కథ పూర్తి స్థాయిలో సిద్ధం అయిన తర్వాతనే హీరో దగ్గరకు వెళుతూ వస్తున్నాడు. అయితే అతని మూడో సినిమా ఆరెంజ్ విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మరొక రికార్డును క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్ కూడా అప్పట్లో భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం విడుదల తరువాత ప్రేక్షకులను అంతగా కనెక్ట్ అవ్వలేదు పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఒంగోలు గిత్త సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా సక్సెస్ అవ్వడం లేదు అని అతనికి మిగతా నిర్మాతలు కూడా పెద్దగా ఆఫర్స్ అయితే ఇవ్వలేదు.

    Bommarillu bhaskar another good offer from geetha arts

    ఇక చివరకు గీతా ఆర్ట్స్ GA2 లోనే అతను మంచి ఆఫర్ అందుకున్నాడు. నిర్మాత అల్లు అరవింద్ భాస్కర్ మీద నమ్మకంతో అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (MEB) అనే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. సక్సెస్ అవ్వడంతో భాస్కర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అతనికి మరికొన్ని బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. కానీ భాస్కర్ మాత్రం తొందర పడకుండా ముందుకు వెళ్లాలని చూస్తున్నాడు. అయితే మళ్ళీ గీత ఆర్ట్స్ సస్థలోనే మరొక సినిమా చేయాలని ఆలోచించాడట. నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ పరంగా అతనికి మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక యువ హీరో కోసం మంచి ఫ్యామిలీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో కథను రాయమని చెప్పారట.

    బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం తనదైన శైలిలో కొత్త తరహా కథను రాసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అయితే అటు అఖిల్ అక్కినేనికి కూడా మంచి విజయాన్ని అందించింది. ఎందుకంటే ఆ హీరో కూడా గత కొంతకాలంగా మొదటి సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం సక్సెస్ కావడంతో అతని కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మరి భాస్కర్ తన తదుపరి సినిమాను ఏ హీరోతో చేస్తాడో చూడాలి.

    English summary
    Bommarillu bhaskar another good offer from geetha arts,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X