మెగా ఫ్యామిలికి జూ ఎన్టీఆర్ ద్వారా షాక్ ఇవ్వనున్న దర్శకుడు..?

By Sindhu

ఆమధ్య వచ్చిన 'ఆరెంజ్' సినిమా ఫ్లాప్ ప్రభావం ఆ చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ని చాలా కాలం వెంటాడింది. ఆ దెబ్బకి కొన్నాళ్ల పాటు ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయాడు. మళ్లీ ఇటీవలే టాలీవుడ్ లో కనపడుతున్నాడు. ముఖ్యంగా హైదరాబాదులోనే ఉంటూ, మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. 'మెగా' క్యాంప్ తనపై చేసిన దుష్ప్రచారానికి ఓ పెద్ద హిట్ తో సమాధానం ఇవ్వాలని భాస్కర్ యోచిస్తున్నాడట.

ఈ క్రమంలో ఇతను తాజాగా రెడీ చేసిన సబ్జెక్ట్ విని, ఎన్టీఆర్ ఇతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో, ప్రస్తుతం భాస్కర్ ఈ సినిమా స్క్రిప్ట్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఊసరవెల్లి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే భాస్కర్ సినిమా స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇది కొంచం క్లాస్ టచ్ తో సాగే సినిమా అవుతుందని తెలుస్తోంది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X