బొ్మ్మరిల్లు భాస్కర్ కి ఆ హీరోతో చేయటం ఇష్టం లేదట కానీ..
రామ్ చరణ్ తో చేసిన ఆరెంజ్ ఫెయిల్యూర్ తో అప్పటివరకూ ఓ వెలుగు వెలిగిన బొమ్మరిల్లు భాస్కర్ ఒక్కసారిగా పేడెవట్ అయిపోయాడు.అయితే మళ్ళీ తానేమిటో నిరూపించుకోవాలని దిల్ రాజు ని కలిసాడని రీసెంట్ వార్త.అయితే దిల్ రాజు మాత్రం వరుణ్ సందేశ్ తో సినిమా చేసి హిట్ కొట్టమని,అదీ బడ్డట్ లిమిట్ లోనే ఉండాలని కండీషన్ పెట్టి మరీ భాస్కర్ కి సినిమా ఇవ్వటానికి సిద్దపడ్డాడని వినపడుతోంది.
అందులోనూ ఈ మధ్య వరసగా బృందావనం,మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలు హిట్టవటంతో మళ్లీ స్వింగ్ లోకి వచ్చేసాడు దిల్ రాజు.అయితే వరుణ్ సందేశ్ అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డ భాస్కర్ తనకు పరిచయమున్న పెద్ద హీరో డేట్స్ తెచ్చుకుంటానని అన్నాడని తెలుస్తోంది.ఇక భాస్కర్ దృష్టి మాత్రం సిద్దార్దపైన ఉందిట.తనకు బొమ్మరిల్లు అనే చిత్రంతో హిట్ ఇచ్చిన సిద్దార్దతో మళ్ళీ హిట్ ఇస్తే బావుంటుందని బావిస్తున్నాట్ట.


Click it and Unblock the Notifications











