పవన్ సినిమాకీ బొత్సానే?
పవన్ పులి చిత్రం అనంతరం పూరీ దర్శకత్వంలో చిత్రానికి కమిట్ అయ్యాడనే విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని హాస్య నటుడు గణేష్ నిర్మించనున్నారు. అయితే గణేష్ వెనుక కాంగ్రేస్ మినిస్టర్ బొత్సా సత్యనారాయణ ఉన్నారని, ఆయనే ప్రస్తుతం ఆంజనేయులు సినిమాకి డబ్బు పెట్టుబడి పెడుతున్నారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంతకాలంగా చెప్పుకుంటున్నదే. అలాగే ఆ తర్వాత పవన్ తో చేయబోయే చిత్రానికి కూడా బొత్సాదే పెట్టుబడి అంటున్నారు.
ఇక పూరీ అండదండలతోనే గణేష్ ఇలా నిర్మాతగా మారాడనేది తెలిసిందే. అందుకే పూరీ రికమెండేషన్ తో తనకు దగ్గర బంధువైన పరుశరామ్ తో ఆంజనేయులు సినిమా తీయిస్తుడని చెప్తున్నారు. ఆ తర్వాత తాను గణేష్ తో సినిమా చేస్తానని చెప్పి ఒప్పించాడంటున్నారు. రవితేజ హీరోగా పరుసరామ్ దర్శకత్వంలో ఈ ఆంజనేయులు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ క్రమంలో బొత్సా పవన్ చిత్రానికి సైతం డబ్బు సమకూర్చే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఇక ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ రెస్ట్ కోసం పూనా వెళ్ళాడనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నారని వినిపిస్తోంది. అట్నుంచి అటే శింగనమల రమేష్ కొమురం పులి చిత్రం షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్తాడని తెలుస్తోంది. బ్యాంకాక్ ఈ చిత్రం కోసం నలబై రోజులు రెగ్యులర్ షూట్ ఎరేంజ్ చేసారు. ఆ తర్వాత మిగతా పార్ట్ హైదరాబాద్ లో ఫినిష్ చేయటానికి దర్శకుడు ఎస్.జె.సూర్య ప్లాన్ చేసారు.ఆ చిత్రం తర్వాత పూరీ చిత్రం ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications











