నిర్మాతగా మారిన హాస్య నటుడు గణేష్ వెనుక ఆర్ధిక అవసరాలు తీర్చటానికి ఓ కాంగ్రెస్ మినిస్టర్ ఉన్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకే అతను వరసగా స్టార్స్ తో భారీ సినిమాలు తీయటానికి ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇంతకీ ఆ మినిస్టర్ మరెవరో కాదని బొత్సా సత్యనారాయణ అని మరికొందరు చెప్తున్నారు. అందుకే గణేష్ సినిమా ఓపినింగ్ కి భారీ స్దాయిలో మినిస్టర్స్ అటెండయ్యారని అంటున్నారు. అయితే గణేష్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే సంపాదించాడనేది నిజం. ఇక ప్రస్తుతం రవితేజతో(ఆంజనేయులు) చేస్తున్న గణేష్ ఆ తర్వాత పవన్ తో (పూరీ సినిమా), మరో సినిమా(యువత ఫేమ్ పరుశరామ్)చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.