పవన్ కళ్యాణ్ తో సోషియో పాంఠసీ..అదే నిర్మాత ప్లానింగ్
పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ చిత్రం నిర్మించిన బొత్సా సత్యనారాయణ తిరిగి మరో చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఓ సోషియో పాంఠసీ చిత్రాన్ని పవన్ తో నిర్మిస్తే ఓ రేంజిలో ఉంటుందని పవన్ వద్ద ప్రపోజల్ పెట్టారట. దానికి వెంటనే పవన్ ఆమోద ముద్రవేసి తాను సరైన కథతో వస్తే డేట్స్ ఇవ్వటానికి రెడీ నే అని ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే డైరక్టర్ ఎవరనేది మాత్రం ఫైనలైజ్ చెయ్యలేదట.గణేష్ నే ఈ చిత్రానికి కూడా నిర్మాతగా ఉంచి లాగిద్దామనే ఆలోచనలతోనే బొత్సా ఉన్నారుట.ఇక డైరక్టర్ గా పవన్ ఇద్దరు,ముగ్గురు ఛాయిస్ లు చెప్పారట. అందులో త్రివిక్రమ్ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. త్రివిక్రమ్..ఓ సోషియో పాంఠసీ కథను రెడీ చేసుకుంటే ఈ ప్రాజెక్టు ఇమ్మీడియట్ గా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్..షాడో చిత్రం షూటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో పాల్గొంటారు.గబ్బర్ సింగ్ ని కూడా గణేష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications











