క్రికెటర్ ధోనీతో పవర్ స్టార్ పవన్ ఫైట్.. అంతలా ఇద్దరి మధ్య ఏం జరిగిందబ్బా!!

క్రికెటర్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో భారీగా అభిమానులు ఉంటారు. ఆయనంత స్థాయిలో కాకపోయినా.. దాదాపు అదే రేంజ్ లో అభిమానించే ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగులో ఉంటారు. అయితే ఈ ఇద్దరి మధ్యలో ఓ వార్ జరగబోతుంది. అదేంటి.. వీరిద్దరి మధ్య వార్ ఏంటని ఆలోచిస్తున్నారా? వివరాళ్లోకి వెళితే..

ఈ సారి ఇంట్రెస్టింగ్ గా: సినీ ఇండస్ట్రీలో శుక్ర‌వారానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు వచ్చిందంటే.. సినీ ప్రియుల‌కు ఇక పండ‌గే. ఎందుకంటే ప్ర‌తీ శుక్ర‌వారం కొత్త సినిమాలు బాక్సాఫీస్ ముందు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని హిట్ అయితే మరి కొన్ని బోల్తా కొడుతుంటాయి. ఒక్కోసారి అన్నీ తేడా కొడుతుంటాయి. అలా ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద కొన్ని చిత్రాలు రానున్నాయి. కానీ ఈ సారి పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

Boxoffice Fight Between Cricketer Dhoni LGM Movie and Pawan Kalyan BRO movie

LGM వర్సెస్ బ్రో: వచ్చే శుక్ర‌వారం (జూలై 28) బాక్సాఫీస్ వ‌ద్ద ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. అది క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య కావ‌డం విశేషం. అయితే అది డైరెక్ట్ గా కాదు. చెన్నై సూప‌ర్ సూప‌ర్ కింగ్స్ సీఎస్కే ధోనీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తన నిర్మాణ సంస్థలో 'లెట్స్ గెట్ మ్యారీడ్' (LGM)అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జులై 28న రిలీజ్ కానుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'బ్రో' సినిమా కూడా జులై 28నే విడుద‌లకు రెడీ అయింది.

Boxoffice Fight Between Cricketer Dhoni LGM Movie and Pawan Kalyan BRO movie

ధోనీ ఇవానా క్రేజ్ తో: LGM సినిమాను త‌మిళంలో ధోనీ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మించారు. అయితే ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఓ వైపు ధోనీ నిర్మించడం.. మరోవైపు ఇందులో 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా నటించడంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. రీసెంట్ గా ఈ చిత్ర‌ ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. రెండు భాష‌ల్లోనూ ఈ ప్రచార చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమాను చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Boxoffice Fight Between Cricketer Dhoni LGM Movie and Pawan Kalyan BRO movie

అత్తా కోడలు అర్థం చేసుకున్నారా?: పెళ్ళికి ముందు అత్తా, కోడ‌లు ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాల‌నే కండిష‌న్ తో.. ఇరు కుటుంబాలు క‌లిసి ఓ టూర్‌కు వెళ్తారు. అక్క‌డ అత్తా, కోడ‌లిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. మరి ఈ ఇద్దరు కిడ్నాపర్ల నుంచి ఎలా తప్పించుకున్నారు? మరి అత్తాకోడలు ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? అనేది మిగతా కథ. ఈ చిత్రానికి రమేష్‌ తమిళమణి దర్శకత్వం వహించారు. హీరోయిన్ కి అత్త పాత్రలో సీనియర్ నటి నదియా న‌టించారు.

Boxoffice Fight Between Cricketer Dhoni LGM Movie and Pawan Kalyan BRO movie

సహజంగానే అంచనాలు ఎక్కువగా: ఇక 'బ్రో' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం. ఇప్పటికే రిలీజైన టీజర్, రెండు పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. అనుకోని ప్రమాదంలో మరణించిన వ్యక్తికి దేవుడు కనిపించి రెండో అవకాశం ఇస్తే.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయనేదే కథ.

పవన్ టైమ్ అనే మోడ్రన్ గాడ్ పాత్రలో కనిపించనుండగా.. మార్క్ అనే పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో పవన్ ఉండటం వల్ల సహజంగానే సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎంత కాదనుకున్నా నెటివిటీ కాబట్టి మొదటగా 'బ్రో' సినిమా చూడటానికే అభిమానులు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అదే ఒకవేళ LGM మొదటి రోజు మంచి టాక్ ను అందుకుంటే మాత్రం 'బ్రో' కు కాస్త పోటి ఇచ్చినట్టే. చూడాలి మరి 'బ్రో'కు LGm పోటీనిస్తుందో లేదో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X