బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
భద్ర సినిమాతో అప్పుడెప్పుడో 2005లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మాస్ కమర్షియల్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ 15ఏళ్లలో కేవలం 8 సినిమాలే చేశాడు. ప్రస్తుతం మరో సినిమా సెట్స్ పైన ఉంది. అయితే త్వరలోనే బోయపాటి మరో స్టార్ హీరోతో కొత్త ప్రాజెక్టును సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ సెట్టయితే రెండు బాషల్లో సినిమా రూపొందిస్తారట.

బాలయ్య సినిమాతో బిజీగా..
దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ సింహా, లెజెండ్, సరైనోడు వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. చివరగా చేసిన వినయ విధేయ రామ్ డిజాస్టర గా నిలిచింది. అయితే ఆ తరువాత వెంటనే బాలయ్యతో మరో మాస్ సినిమాను స్టార్ట్ చేశాడు. బాలయ్యతో చేస్తున్న మూడవ సినిమా కాబట్టి అంచనాలు మామూలుగా లేవు.

ఎంతమంది రిజెక్ట్ చేసినా..
నిజానికి బోయపాటి శ్రీనివాస్ గత రెండు సినిమాలు డిజాస్టర్ కావడం వల్ల అగ్ర హీరోల నుంచి అంత ఈజీగా ఆఫర్స్ అందుకోవడం లేదు. కానీ ఎంతమంది రిజెక్ట్ చేసినా కూడా తన ప్రయత్నం ఆపడం లేదు. BB హిట్టయితే పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు.

కోలీవుడ్ స్టార్ హీరోతో..
ఇక మొత్తానికి ఈ దర్శకుడికి కోలీవుడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాది. సూర్య. తెలుగులో కూడా బలమైన మార్కెట్ సెట్ చేసుకున్న సూర్య ఎప్పటి నుంచో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మంచి కథ రెడీ అవ్వకపోవడంతో ఇన్నాళ్ళు ధైర్యం చేయలేదు.

బాలయ్యతో మూవీ అయిపోగానే..
ఇక ఫైనల్ గా దర్శకుడు ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను మెప్పించినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ లో సినిమాను నిర్మించేందుకు ఒక బడా ప్రొడక్షన్ హౌజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా షూటింగ్ అయిపోగానే కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి ఆ సినిమా ఏ స్థాయిలో వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











