For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటి లిస్టులో మరో యువ హీరో.. అఖండ సీక్వెల్ కంటే ముందే పవర్ఫుల్ స్టోరీ?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందకున్న బోయపాటి శ్రీను తదుపరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అఖండ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన బోయపాటి ఆ తర్వాత అదే కథకు సీక్వెల్ కూడా తెరపైకి తీసుకురావాలని చూస్తున్నాడు. అయితే దాని కంటే ముందుగానే ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ యువ హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

    ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న కూడా..

    ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న కూడా..

    మాస్ దర్శకుడిగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీను సినిమాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న కూడా అందులో ఎమోషనల్ సన్నివేశాలతో పాటు దానికి తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. యాక్షన్ ప్రియులకు ఒక ఫుల్ మీల్స్ అనే తరహాలో సినిమాలు తెరపైకి తీసుకు వస్తూ ఉంటారు. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

    ఆ సినిమాతో..

    ఆ సినిమాతో..

    బోయపాటి శ్రీను భద్ర సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తులసి సినిమాతో సక్సెస్ అందుకున్న అనంతరం దమ్ము తో డిజాస్టర్ ఎదుర్కన్నాడు. ఇక బాలకృష్ణతో చేసిన సింహా లెజెండ్ సినిమాలు సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆ సినిమాతోనే ఒక్కసారిగా ఆయన రేంజ్ స్టార్ డైరెక్టర్ గా పెరిగిపోయింది.

    అఖండ చరిత్ర

    అఖండ చరిత్ర

    ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని కరోనా కష్టకాలంలో కూడా చిత్ర పరిశ్రమకు ఒక మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీ లో ఇటీవల కాలంలో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా టాప్ లిస్టులో నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లో కూడా అన్ని రకాలుగా రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది.

    అఖండ సీక్వెల్.. అల్లు అర్జున్ తో..

    అఖండ సీక్వెల్.. అల్లు అర్జున్ తో..

    మొత్తానికి అఖండ సినిమా సక్సెస్ కావడంతో బోయపాటి శ్రీను నుంచి భవిష్యత్తులో రాబోయే సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయని చెప్పవచ్చు. అఖండ సినిమాకు సీక్వెల్ గా కూడా ఉంటుంది అని ఇదివరకే అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరుగుతే అఖండను కొనసాగింపు కథలో మరొక హీరో కూడా ఉంటాడని, అల్లుఅర్జున్ కూడా కనిపించే అవకాశం ఉన్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చారు.

    Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
    మరో హీరో కోసం పవర్ఫుల్ కథ

    మరో హీరో కోసం పవర్ఫుల్ కథ

    బోయపాటి శ్రీను భవిష్యత్తులో ఒక యువ హీరోతో కూడా కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ లిస్టులో హీరో రామ్ పోతినేని కూడా ఉన్నాడట. అసలైతే గత ఏడాదిలోనే బోయపాటితో రామ్ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ రామ్ మరో కమిట్మెంట్ ఉండడం వలన అలాగే బోయపాటి బాలకృష్ణ తో బిజీగా ఉండటం వలన ఆ కాంబో సెట్ అవ్వలేదు. ప్రస్తుతం అయితే రామ్ కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కాంబినేషన్ పై త్వరలోనే బోయపాటి అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

    English summary
    Boyapati powerful story for tollywood young hero..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    Desktop Bottom Promotion