సరైన సమయంలో హీరోయిన్‌ను దింపుతాం.. రూమర్లకు బోయపాటి చెక్
వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్‌తో బోయపాటి శ్రీను, రూలర్ వంటి ఫ్లాప్‌తో నందమూరి బాలకృష్ణ డౌన్ ఫాల్‌లో ఉన్నారు. కెరీర్‌పరంగా చూస్తే వీరిద్దరికీ గడ్డుకాలమేనని చెప్పాలి. అలాంటి స్థితిలో వీరిద్దరు మళ్లీ కలిసి రాబోతోన్నాయి. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండటం, బాలయ్య అంటే బోయపాటి ప్రత్యేక శ్రద్ద చూపిండం వంటివి వీరి కాంబినేషన్‌పై ఇప్పటికీ ఎంతో కొంత అంచనాలు ఉన్నాయి. ఎంతో వేగంగా సినిమాను పూర్తి చేసేసి ప్రేక్షకులకు అందించాలని అనుకుంటే కరోనా మహమ్మారి అడ్డు తగిలింది.
బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే కొంత పార్ట్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్యకు సర్వసాధారణంగా ఎదురయ్యే ఓ సమస్యే ఈ సినిమాకూ ఎదురైంది. బాలయ్య పక్కన హీరోయిన్‌ను సెట్ చేసేందుకు దర్శక నిర్మాతలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటకే పలువురి పేర్లు వినిపించగా.. ఏదీ కన్‌ఫమ్ కాలేదు. అయితే తాజాగా బోయపాటి ఇదే విషయమై మాట్లాడుతూ.. ఓ స్పష్టతనిచ్చాడు.

బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్‌ను ఫిక్స్ చేశామని బోయపాటి చెప్పుకొచ్చాడు. ఓ ఇద్దరు హీరోయిన్లను అనుకుంటున్నామని, అందులో ఒకరిని సరైన సమయం చూసి ప్రకటిస్తామని తెలిపాడు. కానీ అంతలోపే మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయని, కొంతమందిని కలిశామని, వారు ఒప్పుకోలేదని రూమర్స్ క్రియేట్ చేశారని పేర్కొన్నాడు. రూమర్స్ క్రియేట్ చేయడం కామన్ కదా అని వదిలేశానని బోయపాటి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











