twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ''ఆ గెటప్ కావాల్సిందే బాబూ''.. బాలయ్య మనసు మార్చే పనిలో బోయపాటి?

    |

    నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ సూపర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఉగాది కానుకగా విడుదలైన టీజర్ అఖండమైన స్పందన తెచ్చుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ టీజర్ ద్వారా సీనియర్ హీరోలకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ సాధించిన బాలయ్య మరిన్ని రికార్డులు తిరగరాసేందుకు ముందుకు వెళుతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గెటప్లో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది.

    అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్

    అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా టీజర్ లో సైతం బాలయ్య అలాంటి లుక్ లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. అయితే నిజానికి కధ ప్రకారం బాలకృష్ణ ఈ సినిమాలో అఘోరాగా చాలాసేపు కనిపించాలి, కానీ బాలకృష్ణ బోయపాటిని ఈ పాత్ర నిడివి తగ్గించాలని కోరినట్లు సమాచారం. అయితే ముందు తగ్గించడానికి ఒప్పుకున్న బోయపాటి అందుకు స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు సైతం చేశాడట. కానీ ఇప్పుడు దాన్ని తగ్గిస్తే కథకు పూర్తిగా న్యాయం చేయలేకపోయే అవకాశం ఉందని బాలయ్యను కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం.

     Boyapati Sreenu convincing Balakrishna about ‘Aghora’ track

    నిజానికి బాలకృష్ణ కథ విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పడు, కానీ ఈ అఘోర గెటప్ విషయంలో మాత్రం ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విన్న బాలకృష్ణ ఈ ఎపిసోడ్ ఎక్కువగా ఉంచవద్దు తగ్గించమని బోయపాటిని కోరాడట. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన బోయపాటి శ్రీను తమ అభిమాన హీరో చెప్పడంతో ముందు తగ్గించుకోవడానికి సిద్ధమైనా సరే ఇప్పుడు ఆ ఆ పాత్ర నిడివి తగ్గిస్తే సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భావిస్తున్నాడట. అందుకే బాలకృష్ణని ఎలాగైనా ఒప్పించి ఈ పాత్ర నిడివి అలాగే ఉంచాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అయితే జరగడం లేదు మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    The makers of Balakrishna and Boyapati Sreenu’s Akhanda recently released a teaser which shows the former in Aghora get-up. But actually Balakrishna has apparently asked Boyapati to trim the duration of the Aghora track in the film. But Boyapati was not ready to chop the portion and managed to convince Balakrishna that this particular subplot forms the soul of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X