రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్లో సినిమా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ హీరోతో సినిమా చేయడానికి బడా దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న 'రచ్చ' సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంతో పాటు చెర్రీ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరో వైపు వంశీ పడి పల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రానికి కమిట్ అయ్యాడు. ఇందులో చెర్రీ సరసన సమంత, అమీ జాక్సన్ నటిస్తున్నారు. వీటితో పాటు జంజీర్ హిందీ రీమేక్ ద్వారా చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కూడా . ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఏప్రిల్ 20 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా అందిన మరో హాట్ న్యూస్ ఏమిటంటే...తన తొలి చిత్రం "భద్ర"తోనే ఘనవిజయాన్ని సాధించి, తులసి, సింహా చిత్రాల ద్వారా హేట్రిక్ సాధించిన యువ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక చిత్రంలో నటించబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. యువ హీరో రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, ఈ చిత్రంలో నటించటానికి కథ వినగానే దర్శకుడు బోయపాటికి తన అంగీకారాన్ని హీరో రామ్ చరణ్ తెలియజేశాడని సమాచారం. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వై. జయంతి మూవీస్ పతాకంపై నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దానిపై అధికారిక సమాచారం వెలువడనుంది.


Click it and Unblock the Notifications











