Don't Miss!
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్‌కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బాలయ్య, బోయపాటి ప్రాజెక్ట్.. మళ్ళీ అదే సమస్య.. తగ్గించక తప్పలేదు
నందమూరి అభిమానులు ఫోకస్ అంతా కూడా RRR కంటే ముందు బాలయ్య , బోయపాటి సినిమాపైనే ఉంది. RRR రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ముందుగా బాలకృష్ణ కమర్షియల్ సినిమాను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా కూడా థియేటర్స్ లోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. కానీ తారక్ కంటే ముందే బాలయ్య వస్తాడు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి బోయపాటి ఆలస్యం కారణంగా ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదని టాక్ వస్తోంది.
అసలు విషయంలోకి వస్తే సినిమాకు సంబంధించిన బడ్జెట్ కట్టింగ్స్ గురించి ప్రస్తుతం మరొక న్యూస్ కూడా వైరల్ అవుతోంది. గతంలో చాలా సార్లు సినిమా బడ్జెట్ లో నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారని టాక్ వచ్చింది. మొదట దర్శకుడు అనుకున్న బడ్జెట్ అయితే 70కోట్లు. కానీ అందుకు బాలయ్య కూడా ఒప్పుకోకపోవడంతో లెక్క 55కోట్లకు వచ్చింది. ఇక ఆ తరువాత మరికొంత తగ్గించారట.
ఇక లాక్ డౌన్ అనంతరం మళ్ళీ షూటింగ్ ప్లాన్ రెడీ చేసుకునే క్రమంలో నిర్మాతలు మరోసారి రిస్క్ ఎక్కువగా ఉందని ఆ బడ్జెట్ ని 40కోట్లకు ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. గతంలో బోయపాటి బడ్జెట్ ఎంత చెబితే అంత ఫిక్స్ చేసిన నిర్మాతలు ఉన్నారు. అవసరం అయితే బోయపాటి తన రెమ్యునరేషన్ ని కూడా తగ్గించుకునేవారు. కానీ వరుస అపజయాల అనంతరం అటు బాలయ్యపై కూడా అంత పెట్టుబడి పెట్టాలంటే కొంత ఆలోచించాల్సిందే. పైగా కోవిడ్ కష్టకాలంలో మరింత రిస్క్ అని నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.