BB3: మరో ఫ్యామిలీ హీరోను విలన్‌గా మారుస్తున్న బోయపాటి.. సోనూ సూద్ రిజెక్ట్ చేయడంతో..

సినిమా ఇండస్ట్రీలో పద్ధతులు చాలానే మారుతున్నాయి. హీరోలు విలన్స్ అవుతున్నారు.. విలన్స్ హీరోలు అవుతున్నారు. విలన్ నుంచి హీరో అవ్వడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమే. ఇక హీరోలను విలన్ గా చేయడం నేటితరం సరికొత్త ట్రెండ్. ఇక బోయపాటి శ్రీను లాంటి దర్శకుడి చేతిలో పడితే మామూలుగా ఉండదు. ఇక బాలకృష్ణ సినిమా కోసం మరో ఫ్యామిలీ హీరోను నెగిటివ్ గా చూపించబోతున్నాడట.

బోయపాటి పవర్ఫుల్ విలన్స్

బోయపాటి పవర్ఫుల్ విలన్స్

బోయపాటి శ్రీనివాస్ బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాల్లో విలన్ రోల్స్ ఎంతగా క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లెజెండ్ తో జగపతిబాబు కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇక సరైనోడు సినిమాలో క్లాస్ గా ఉండే ఆది పినిశెట్టిని పవర్ఫుల్ విలన్ గా ప్రజెంట్ చేశాడు.

BB3పై పెరుగుతున్న అంచనాలు

BB3పై పెరుగుతున్న అంచనాలు

ఇక వినయ విధేయ రామ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబేరాయ్ ని కూడా పవర్ఫుల్ విలన్ గా చూపించి మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు కాబట్టి విలన్ ఎలా ఉండడబోతున్నాడు అనే ఊహ అంచనాలను అందుకొని విధంగా ఉంది. విలన్ ఎవరనే దానిపై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది.

సోనూసూద్ ని అనుకున్నారు కానీ..

సోనూసూద్ ని అనుకున్నారు కానీ..

అసలే సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు కనిపించబోతున్నారు. బాలయ్య నెవర్ బిఫోర్ అనేలా అఘోరా పాత్రలో కూడా దర్శనమివ్వనున్నాడు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే అంచనాల డోస్ ని అమాంతంగా పెంచేస్తున్నాయి. ఇక మొదట విలన్ గా సోనూ సూద్ ని అనుకున్నారట. కానీ అతను 3.5కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తుండడంతో వెనక్కి తగ్గారట.

మరో ఫ్యామిలీ హీరో విలన్ గా..

మరో ఫ్యామిలీ హీరో విలన్ గా..

ఇక బోయపాటి తన రెగ్యులర్ సెంటిమెంట్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని పూర్తిగా నెగిటివ్ పాత్రలో చూపించడానికి రెడీ అయ్యారని సమాచారం. మిగతా స్టార్స్ ని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్ గా శ్రీకాంత్ అయితే బెటర్ అని చాలా పవర్ఫుల్ గా కూడా చూపించవచ్చని డిసైడ్ అయ్యారట.

Recommended Video

Balakrishna Comments On Corona Vaccine
గతంలో వర్కౌట్ కానీ శ్రీకాంత్ విలన్ పాత్ర

గతంలో వర్కౌట్ కానీ శ్రీకాంత్ విలన్ పాత్ర

గతంలో శ్రీకాంత్ నాగ చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం అనే సినిమాలో విలన్ గా కనిపించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు బోయపాటి మేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి శ్రీకాంత్ ని పర్ఫెక్ట్ విలన్ గా చూపిస్తాడాని చెప్పవచ్చు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X