బాలకృష్ణ కోసం థమన్.. థియేటర్లు దద్దరిల్లేలా ఆ సాంగ్ రీమిక్స్!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రయూనిట్ అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ విషయమై ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాణీలు కట్టబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో బాలయ్య ఓల్డ్ మూవీ బంగారు బుల్లోడు లోని ఓ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. థమన్ స్టైల్‌లో ఈ పాటకు మెరుగులు దిద్ది ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారట బోయపాటి.

గతంలో బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ''సింహ,లెజెండ్'' సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో తాజా చిత్రంపై షూటింగ్‌కి ముందే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు రీచ్ అయ్యేలా బోయపాటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. విలన్‌గా నటుడు శ్రీకాంత్ నటించనున్నాడు. త్వరలోనే వారణాశిలో చిత్రీకరణ మొదలు కానుంది. చిత్రంలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











