Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
సీనియర్ హీరో బాలకృష్ణ 106వ సినిమాకు హీరోయిన్ దొరకడం లేదని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా కోసం హీరోయిన్ వేట కష్టతరమైందని విన్నాం. అయితే తాజా సమాచారం మేరకు బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు ఓ హీరోయిన్ ఓకే చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి పోతే..
బాలయ్యతో ఆట.. హీరోయిన్ వేట
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ని మాత్రం ఫైనల్ చేయలేదు బోయపాటి. ఈ మేరకు హీరోయిన్ వేటలో పడ్డారు యూనిట్ సభ్యులు.
బాలయ్యకు హీరోయిన్ కష్టాలు.. కీర్తి రిజెక్ట్
ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న బోయపాటి హీరోయిన్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని టాక్ నడించింది. ఎందరో హీరోయిన్లను సంప్రదించినప్పటికీ పలు కారణాల వల్ల ఎవ్వరూ శిఘ్ చేయలేదట. ఈ మేరకు కీర్తి సురేష్ కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో బాలయ్యకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి అని అంతా చెప్పుకున్నారు.
చివరకు ఈ భామ ఓకే..
అయితే చివరకు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించేందుకు కేథరిన్ త్రెసా ఓకే చెప్పిందనేది తాజా సమాచారం. కేథరిన్‌ను బోయపాటి సంప్రదించగా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ని ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారట బోయపాటి.
బాలయ్యతో రోజా సమరం
ఇక ఈ సినిమాలో బాలయ్యతో రోజా సమరం అనేది స్పెషల్ ఎపిసోడ్ కానుందని టాక్ నడుస్తోంది. బోయపాటి మార్క్ తో ఈ ఇద్దరి మధ్య సాగే హోరాహోరీ సన్నివేశాలు నందమూరి అభిమానులను కనువిందు చేయనున్నాయని అంటున్నారు. బాలయ్యను ఢీ కొట్టేందుకు రోజా రెడీ అవుతోందని టాక్.
Recommended Video
బాలయ్య మీద బోయపాటిదే పై చేయి
ఇక ఈ సినిమా రెమ్మ్యూనరేషన్ విషయంలో బోయపాటిదే పై చేయి అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బోయపాటికి 15 కోట్ల రెమ్మ్యూనరేషన్ ఇస్తే.. బాలయ్యకు 10 కోట్లే ఇస్తున్నారట ఈ చిత్ర నిర్మాత.