twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా?

    |

    సీనియర్ హీరో బాలకృష్ణ 106వ సినిమాకు హీరోయిన్ దొరకడం లేదని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా కోసం హీరోయిన్ వేట కష్టతరమైందని విన్నాం. అయితే తాజా సమాచారం మేరకు బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు ఓ హీరోయిన్ ఓకే చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి పోతే..

    బాలయ్యతో ఆట.. హీరోయిన్ వేట

    బాలయ్యతో ఆట.. హీరోయిన్ వేట

    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ని మాత్రం ఫైనల్ చేయలేదు బోయపాటి. ఈ మేరకు హీరోయిన్ వేటలో పడ్డారు యూనిట్ సభ్యులు.

    బాలయ్యకు హీరోయిన్ కష్టాలు.. కీర్తి రిజెక్ట్

    బాలయ్యకు హీరోయిన్ కష్టాలు.. కీర్తి రిజెక్ట్

    ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న బోయపాటి హీరోయిన్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని టాక్ నడించింది. ఎందరో హీరోయిన్లను సంప్రదించినప్పటికీ పలు కారణాల వల్ల ఎవ్వరూ శిఘ్ చేయలేదట. ఈ మేరకు కీర్తి సురేష్ కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో బాలయ్యకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి అని అంతా చెప్పుకున్నారు.

    చివరకు ఈ భామ ఓకే..

    చివరకు ఈ భామ ఓకే..

    అయితే చివరకు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించేందుకు కేథరిన్ త్రెసా ఓకే చెప్పిందనేది తాజా సమాచారం. కేథరిన్‌ను బోయపాటి సంప్రదించగా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈమెతో పాటు మరో హీరోయిన్‌ని ఈ సినిమా కోసం ఎంపిక చేయనున్నారట బోయపాటి.

    బాలయ్యతో రోజా సమరం

    బాలయ్యతో రోజా సమరం

    ఇక ఈ సినిమాలో బాలయ్యతో రోజా సమరం అనేది స్పెషల్ ఎపిసోడ్ కానుందని టాక్ నడుస్తోంది. బోయపాటి మార్క్ తో ఈ ఇద్దరి మధ్య సాగే హోరాహోరీ సన్నివేశాలు నందమూరి అభిమానులను కనువిందు చేయనున్నాయని అంటున్నారు. బాలయ్యను ఢీ కొట్టేందుకు రోజా రెడీ అవుతోందని టాక్.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    బాలయ్య మీద బోయపాటిదే పై చేయి

    బాలయ్య మీద బోయపాటిదే పై చేయి

    ఇక ఈ సినిమా రెమ్మ్యూనరేషన్ విషయంలో బోయపాటిదే పై చేయి అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బోయపాటికి 15 కోట్ల రెమ్మ్యూనరేషన్ ఇస్తే.. బాలయ్యకు 10 కోట్లే ఇస్తున్నారట ఈ చిత్ర నిర్మాత.

    English summary
    Nandamuri Balakrishna commits with Boyapati srinu. This movie will come to sets as soon as poosible. As per latest talk heroine Catherine Tresa gave green signal for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X