Don't Miss!
- Sports
ఆ విషయంలో వృద్ధిమాన్ సాహాకు లైన్ క్లియర్.. ఇక రంజీట్రోఫీలో ఆ జట్టు తరఫున బరిలోకి..
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- News
ఒక్కరు చెప్పేది 135 కోట్ల మంది వినాలా-హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా కీలక కామెంట్స్..
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Automobiles
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
అఖండ ఎఫెక్ట్.. ఆ సినిమా హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోబోతున్న బోయపాటి
అఖండ మూవీ సక్సెస్ తో దర్శకుడు బోయపాటి శ్రీను ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో నెక్స్ట్ మూవీ చేయడానికి సిద్ధం అయిపోయాడు బోయపాటి. అయితే ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీ కోసం హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ హాట్ టాపిక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే....

అఖండ బ్లాక్ బస్టర్
నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ మూవీ అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇందులో పూర్ణ, జగపతి బాబు కీలక పాత్రలో నటించగా, శ్రీకాంత్ విలన్ గా నటించి మంచి పేరు తెచ్చున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అఖండ సీక్వెల్
ప్రేక్షకుల అంచనాలను అందుకొని అఖండ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలయ్య తో కలిసి ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి బోయపాటి రెడీ అయిపోయారు. అయితే బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు. బాలయ్య ఇచ్చిన కమిట్మెంట్ పూర్తయ్యే లోపు మరో సినిమాను చేయాలని నిర్ణయించుకున్న బోయపాటి ఇంకో హీరోతో సినిమాకు సిద్దమయ్యాడు.

రామ్ తో బోయపాటి మూవీ
ప్రస్తుతం ట్యాలెంటెడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో రామ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ కు కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు హీరో కంటే దర్శకుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. హీరో రామ్ ఈ సినిమాకు 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే, దర్శకుడు బోయపాటి మాత్రం 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అఖండ సీక్వెల్ మరింత ఆలస్యం
ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఆయన రామ్ తో లింగుసామి చేస్తున్న సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ దర్శకుడు లింగుస్వామితో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. ఆ తర్వాత రామ్ దర్శకుడు బోయపాటి ప్రాజెక్ట్ లో చేరనున్నారు. బోయపాటి, రామ్ కాంబినేషన్ లో మంచి మసాలా లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా అఖండ
ఈ
ప్రాజెక్టు
తర్వాత
బోయపాటి
తన
నెక్స్ట్
మూవీని
ఐకాన్
స్టార్
అల్లు
అర్జున్
తో
చేసే
అవకాశం
ఉంది.
గీతా
ఆర్ట్స్
ఈ
మూవీని
నిర్మించే
ఛాన్స్
ఉంది.
ఈ
రెండు
ప్రాజెక్టులు
పూర్తి
చేశాక
బోయపాటి
అఖండ
సీక్వెల్
పై
దృష్టి
పెడతారని
అంటున్నారు.
ఇక
అందుకోసం
అఖండ
క్లైమాక్స్
లో
చిన్న
లీడ్
కూడా
ఇచ్చారు
బోయపాటి.
ఇక
అఖండ
భారే
సక్సెస్
నేపధ్యంలో
అఖండ
2
పాన్
ఇండియా
లెవల్
లో
తెరకెక్కించే
అవకాశం
ఉందని
అంటున్నారు.