చిరంజీవి 150 చిత్రానికి డైరక్టర్ ఎంపిక పూర్తయ్యిందా?
మొదలవ్వక ముందే ఎంతో ఎక్సపెక్టేషన్స్ రేపుతున్న చిరంజీవి 150 చిత్రానికి బోయపాటి శ్రీనుని దర్శకుడుగా ఎంపిక చేసారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సింహాతో వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు సూపర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు అయితేనే తనకు కరెక్టుగా సూట్ అవుతాడని చిరు, అల్లు అరవింద్ భావించారని చెప్తున్నారు. ఇక చాలామంది వివి వినాయిక్ ని దర్శకుడుగా ఊహించారని,అయితే అతను నెక్ట్స్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు కమిటవటంతో ఈ రేసు నుంచి తప్పుకున్నాడని చెప్తున్నారు. ఇక టాక్ రావటానికి ఈ మధ్య బోయపాటి..ఎన్టీఆర్ తో కథ ఓకే కాకపోవటమూ, చిరు కి సంభందించిన పంక్షన్స్ లో కనపడటమూ కూడూ అయ్యుండే అవకాశం ఉంది.
ఇక పాతవాసనలతో గుభాళించినా బోయపాటి మాస్ ప్రేక్షకుడు పల్స్ పట్టుకుంటాడు కాబట్టి మంచి హిట్ ఇచ్చే అవకాశముందంటున్నారు. అయితే చిరంజీవి ఆశిస్తున్నట్లుగా ఎంతవరకూ ప్రజల సమస్యలను తెరకెక్కించగలడు అన్నదే సమస్య. తన కొత్త చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని చిరంజీవి ఇటీవలే తన కొత్త చిత్రం గురించి చెప్పారు. ఆ కొత్త చిత్రం ఠాగూర్ చిత్రంలా ఉంటుందని, మానవీయ కోణంలోనే ఈ చిత్రం ఉంటుందన్నారు. నెలకు పదిరోజులు చిత్రం చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పారు. కాగా 90 శాతం చిత్రం ఆంద్రప్రదేశ్ లోనే చిత్రీకరిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











