twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చేయాల్సిన సినిమాలో పాన్ ఇండియా హీరో.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన మరో టాలీవుడ్ డైరెక్టర్

    |

    ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలు దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిగతా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పలేము గాని టాలీవుడ్ లో మాత్రం సినిమాలకు ఎప్పటికప్పుడు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి కంటెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కష్టకాలంలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన తెలుగు హీరోలు మిగతా ఇండస్ట్రీలో కూడా ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంతున్నారు. దర్శకులు కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉండడం స్టార్ట్ చేశారు.

    ప్రాజెక్ట్ క్యాన్సిల్..

    ప్రాజెక్ట్ క్యాన్సిల్..

    త్వరలోనే మరొక తెలుగు దర్శకుడు కూడా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఆ కథను రామ్ చరణ్ కోసం అనుకున్నప్పటికి కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ RRR సినిమా తర్వాత కూడా వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

    బోయపాటి దర్శకత్వంలో

    బోయపాటి దర్శకత్వంలో

    RC15 సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారి తమిళ దర్శకుడు శంకర్ తెలుగు హీరోతో చేస్తుండటంతో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమనులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా రామ్ చరణ్ కోసం టాలీవుడ్ అగ్ర దర్శకులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

    KGF స్టార్ తో న్యూ ప్రాజెక్ట్

    KGF స్టార్ తో న్యూ ప్రాజెక్ట్

    అయితే ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటికి మరో అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. దర్శకుడు కూడా సంతోషించి చరణ్ కోసం ఒక పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉండడం వలన బోయపాటి కథపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి చేసేదేమి లేక మరొక హీరో వైపు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు. KGF సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న రాఖీ బాయ్.

    అందుకే అతనిపై ఫోకస్

    అందుకే అతనిపై ఫోకస్

    యష్ తో సినిమా చేయాలని తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇంకా ఆ కాంబినేషన్ పై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు. ఎలాగైనా యష్ తో సినిమా చేయాలని ఆశ పడుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ ఇప్పట్లో దొరికేలా కనిపించడంలేదు. అందుకే బోయపాటి యష్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

    English summary
    Boyapati srinu focus on pan india movie with kannada hero,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X