»   » బోయపాటికి కంటిన్యూ గా షాక్ లు ఇస్తున్న బన్ని ?

బోయపాటికి కంటిన్యూ గా షాక్ లు ఇస్తున్న బన్ని ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లెజండ్ వంటి హిట్ ఇచ్చిన తర్వాత ఒకటి రెండు నెలల్లో బోయపాటి శ్రీను తదుపరి చిత్రం మొదలవుతుంది అనుకున్నారు. అయితే ఈ లోగా లెజండ్ లో హీరోగా చేసిన బాలకృష్ణ..లయిన్ అంటూ సినిమా పూర్తి చేసి డిక్టేటర్ అంటూ మొదలెట్టేసాడు కానీ..ఇప్పటికీ...బోయపాటి శ్రీను చిత్రం మొదలు కాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదట బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి చిత్రం అన్నా ..కారణాంతరాలవల్ల అది ఆగి..అల్లు అర్జున్ తో ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యింది అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. దానికి కారణం ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి... కథ ఇప్పటికే చాలా సార్లు బన్ని మార్పులు చేయిస్తూ ఉండటం వల్లనే లేటు అవుతోంది అంటున్నారు. బోయపాటి రెగ్యులర్ స్టైయిల్ యాక్షన్, లవ్ కు తన టైప్ ఫ్యామిలీ సీన్స్ కలపమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే బోయపాటి చాలా వెర్షన్స్ వినిపించాడని, అయితే బన్ని ఇప్పటికి దేనికీ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చాలా కాన్షస్ గా మారాడని, దాంతో తనలాంటి పెద్ద హిట్ ఇచ్చిన డైరక్టర్ కూడా ఇలాంటి ఇబ్బంది పడటం ఏంటని ఆశ్చర్యపడుతున్నాడని అంటున్నారు. ఓ రకంగా బోయపాటి శ్రీనుకు ఇది షాక్ అంటున్నారు.

Boyapati Srinu getting Bunny shocks

అలాగని బన్ని...వద్ద నుంచి వేరే హీరో దగ్గరకు వెళ్దామంటే ...హీరోలంతా పూర్తి బిజీ అయ్యిపోయారు. దాంతో ఇరుక్కుపోయినట్లు అయ్యింది. మరి ఎప్పటికి బన్నీ ..ఓకే ముందుకు వెళ్దాం అని చెప్తాడా అని టీమ్ మొత్తం ఎదురుచూస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అంతేకాకుండా...ఈ సినిమాలో హన్సిక ను తీసుకుందామని బన్ని ప్రపోజల్ పెట్టాడని, అది బోయపాటికి ఇష్టం లేదని అంటున్నారు. సమంతతో వెళ్దామని బోయపాటి అంటున్నాడని, అయితే మొన్నేగా సత్యమూర్తిలో చేసామని బన్ని చెప్పి హన్సికతో ముందుకు వెళ్దామని అన్నాడని చెప్పుకుంటున్నారు. వీటిల్లో నిజమెంతో కానీ ప్రాజెక్టు ప్రారంభం కోసం బన్ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో...కొద్ది నెలల క్రితం

బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ .... త్వరలో తాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర్జున్‌ హీరోగా నూతన చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు తారాగణాన్ని త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.

చిత్రం వివరాల్లోకి వెళితే.. తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు. ఆ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఆ వివరాలను త్వరలో చెప్తాం. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది. థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.

English summary
Allu Arjun asked Boyapati to rework on the story and meet him again. However from then on Bunny started giving shocks to him. Even before the start of the shooting, Boyapati is facing various problems.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu