Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఖండ హిట్టయినా కాకపోయినా.. ఆ హీరోతో మరో పవర్ఫుల్ మూవీ.. బోయపాటి న్యూ ప్లాన్!
టాలీవుడ్ బెస్ట్ మాస్ కమర్షియల్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను కరెక్ట్ సినిమా తీయగలిగితే అభిమానులకు ఫుల్ మీల్స్ దొరికినట్లే. మొదటి సినిమా భద్ర నుంచి కూడా చాలా తెలివిగా యాక్షన్ డోస్ పెంచుకుంటూ వస్తున్న బోయపాటి సక్సెస్ లెవెల్ ను కూడా పెంచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి తరువాత సినిమాను కూడా ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు సినిమాలతో
సింహా, లెజెండ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ రెండు సినిమాల హిట్స్ తో అగ్ర హీరోలు చాలా మంది బోయపాటితో వర్క్ చేయాలని ఎన్నో రకాలుగా చర్చలు జరిపారు. ఇక అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలతో మరో పవర్ఫుల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ ఎంతో నమ్మకంతో..
ఇక చివరగా చేసిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఆ అవకాశాన్ని బోయపాటి శ్రీను సరైన రీతిలో యూజ్ చేసుకోలేకపోయాడు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా ఎక్కువయ్యిందనే రూమర్స్ కూడా వస్తున్నాయి.
కసిగా వర్క్ చేస్తున్నాడు
అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో బోయపాటి వెంటనే బాలకృష్ణతో మూడవ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. అఖండ అనే టైటిల్ తో ఇటీవల టీజర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ అఘోరా వంటి పాత్రలో కనిపిస్తుండడంతో సినిమా ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని బోయపాటి కసిగా వర్క్ చేస్తున్నాడు.
Recommended Video
అల్లు అర్జున్ తో మరో సినిమా
ఇక ఆ సినిమా హిట్టయినా కాకపోయినా కూడా అల్లు అర్జున్ మాత్రం బోయపాటితో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ నమ్మకంతోనే బోయపాటి కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ కు కాస్త బ్రేక్ రావడంతో ఇప్పటికే బన్నీకి ఒక లైన్ వినిపించాడట. అతనికి నచ్చడంతో స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీ అయినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం పుష్పతో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత ఐకాన్, కొరటాలతో మరో రెండు సినిమాలను పూర్తి చేసి ఆ తరువాత బోయపాటితో వర్క్ చేయవచ్చని టాక్ వస్తోంది.