బాలకృష్ణతో యంగ్ హీరోయిన్ రొమాన్స్.. అంతా సిద్ధం చేసిన బోయపాటి!

నందమూరి నటసింహం బాలకృష్ణ తదుపరి సినిమా కోసం ఓ యంగ్ హీరోయిన్‌ని కన్ఫర్మ్ చేసేశారట బోయపాటి శ్రీను. బాలయ్య కెరీర్ లో 106వ సినిమాగా బోయపాటి మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ హీరోయిన్స్ వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బాలకృష్ణతో రొమాన్స్ చేసేందుకు ఓ యంగ్ హీరోయిన్ ఓకే చెప్పేసిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు రానుందని సమాచారం అందుతోంది. వివరాల్లోకి పోతే..

హీరోయిన్ కష్టాలు.. బోయపాటి ప్రయత్నాలు

హీరోయిన్ కష్టాలు.. బోయపాటి ప్రయత్నాలు

ఇటీవలే బాలకృష్ణ- బోయపాటి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసి రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతున్నారు. అయినప్పటికీ హీరోయిన్ కన్ఫర్మ్ కాకపోవడంతో బోయపాటి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చాలామంది హీరోయిన్స్‌ని సంప్రదించిన ఆయన చివరకు యంగ్ హీరోయిన్ అంజలిని ఒప్పించినట్లు సమాచారం.

కీర్తి సురేష్‌ని సంప్రదిస్తే ఆమె..

కీర్తి సురేష్‌ని సంప్రదిస్తే ఆమె..

ముందుగా ఈ సినిమా కోసం కీర్తి సురేష్‌ని సంప్రదిస్తే ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసింది. కాల్షీట్ల స‌మ‌స్య‌వల్లో, లేదంటే ఇతర కారణం ఏదైనా ఉందో తెలీదు గానీ.. ఈ సినిమా చేయ‌డానికి ససేమిరా నో అనేసింది. దీంతో ఆ తర్వాత కొందరు యంగ్ హీరోయిన్స్‌ని సంప్రదిస్తే అక్కడి నుంచి కూడా ఇలాంటి రెస్పాన్సే వచ్చిందని తెలిసింది.

ఓకే చెప్పిన బ్యూటీ.. స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్న బోయపాటి

ఓకే చెప్పిన బ్యూటీ.. స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్న బోయపాటి

ఆ వెంటనే హీరోయిన్ కేథరిన్‌ని సంప్రదించారని, అయితే బాలయ్య సరసన నటించేందుకు గాను ఆమె పారితోషికం చాలా ఎక్కువగా అడగడంతో ఈ ఆఫర్ అంజలి దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. అయితే మొదట కాస్త ఆలోచించినా చివరకు ఆమె రెడీ అనేయడంతో బాలకృష్ణ- అంజలి మధ్య షూట్ చేయబోయే సన్నివేశాల కోసం బోయపాటి తన స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట.

నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్.. రెట్టింపైన ఉత్సాహం

నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్.. రెట్టింపైన ఉత్సాహం

గతంలో అంజలి బాలయ్యతో కలిసి ‘డిక్టేటర్‌' చిత్రంలో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ జోడీ ఆకట్టుకోవడం ఖాయం అని ఇప్పటికే అంతా ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు.

దానిపైనే ఫోకస్.. త్వరలోనే

దానిపైనే ఫోకస్.. త్వరలోనే

బాలయ్య- బోయపాటిది సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఫినిష్ చేస్తారు అనే దానిపై బాలకృష్ణ అభిమానులు ఫోకస్ పెట్టారు. చిత్రంలో బాలకృష్ణ అఘోరగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. విలన్‌గా నటుడు శ్రీకాంత్ చేస్తున్నాడు. త్వరలోనే వారణాశిలో చిత్రీకరణ మొదలు కానుంది.

Recommended Video

Nandamuri Mokshagna Tollywood Entry Soon | Filmibeat Telugu
ఇదీ బోయపాటి ప్లాన్

ఇదీ బోయపాటి ప్లాన్

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను తమన్ సంగీతం అందించనున్నాడు. రెగ్యులర్ షూట్‌కి రాగానే వేగం పెంచి, శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తూ మే నెలాఖరులో ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట బోయపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X