twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకసారి రిజెక్ట్ చేసిన మళ్ళీ అదే హీరో దగ్గరకు వెళ్లిన బోయపాటి.. ఏదైనా అఖండ తరువాతే?

    |

    ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులలో బోయపాటి శీను కూడా టాప్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. కమర్షియల్ మాస్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బోయపాటి శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. అయితే గత కొంత కాలంగా బోయపాటి సినిమాలు అభిమానుల స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా అఖండ సినిమాపైనే ఉంది.

    నందమూరి బాలకృష్ణతో ఇదివరకే లెజెండ్, సింహా వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న బోయపాటి శ్రీను మూడవసారి చేస్తున్న అఖండ సినిమాతో మరోక బిగ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వీలైనంత త్వరగా ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం అగ్ర హీరోలు వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోతున్నారు. కథ కొంచెం నచ్చినా కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా టాలెంట్ ఉన్న దర్శకులకి ఒకే చెప్పేస్తున్నారు. అయితే హిట్టు కొట్టిన దర్శకులకు కూడా ప్రస్తుతం హీరోలు దొరకడం లేదంటే పరిస్థితి ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత ఖాళీగా ఉండకూడదు అని ఆలోచిస్తున్నాడు.

    Boyapati srinu special focus on star heroes for upcoming projects

    ఇప్పటికే రామ్ పోతినేనికి కూడా ఒక కథ చెప్పినట్లు ఒక న్యూస్ అయితే వైరల్ గా మారింది. బోయపాటి మనసులో ఎప్పటినుంచో కూడా బన్నీతో మరో సినిమా చేయాలని ఉంది ఇదివరకే వీరి కాంబినేషన్లో సరైనోడు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రెండవ సారి కూడా సినిమా చేయాలని దర్శకుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక కథ కూడా వినిపించారు. కానీ అల్లు అర్జున్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. ప్రస్తుతం బోయపాటి చేస్తున్న అఖండ సినిమాతో హిట్ కొట్టిన తరువాతే బన్నీ ఈ దర్శకుడి పై ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

    అందుకే ఎలాగైనా అఖండ సినిమాతో బాక్సాఫీసు హిట్ అందుకొని బోయపాటి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మరోవైపు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పవర్ఫుల్ గా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఒకసారి పాన్ ఇండియా సినిమాలులను టచ్ చేస్తే ఆ తర్వాత కూడా అదే తరహాలో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. బన్నీ కూడా అదే తరహాలో అడుగులు వేయాలని ఆలోచిస్తున్నాడట. ఇక బోయపాటి సినిమాకు ఓకే చెప్పాలి అంటే అంతకంటే ముందు అతను అఖండ సినిమాతో కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ స్థాయి పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి అఖండ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

    English summary
    Boyapati srinu special focus on star heroes for upcoming projects
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X