అల్లు అర్జున్ మూవీలో నందమూరి మోక్షజ్ఞ: ఫస్ట్ సినిమానే అలాంటి కథతో చేస్తాడా?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా వస్తున్నారు. అందులో చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇస్తుండగా.. కొందరు మాత్రం స్టార్ల వారసులుగా పరిచయం అవుతున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నందమూరి కుర్రాడి మొదటి చిత్రం గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా సమాచారం? అది మీరే చూసేయండి!

ప్రకటించిన బాలకృష్ణ
టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు తమ పిల్లలను ఇండస్ట్రీలోకి హీరోలుగా తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే తన కుమారుడు మోక్షజ్ఞను కూడా పరిచయం చేస్తానని నందమూరి బాలకృష్ణ ఎప్పుడో ప్రకటించారు. అప్పటి నుంచి అతడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చేస్తున్నారు. కానీ, మోక్షజ్ఞ తెరంగేట్రం మాత్రం ఆలస్యం అవుతూనే ఉంటోంది.

ఆ దర్శకులతో అంటూ
మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త వచ్చిన తర్వాత.. అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తాడని తరచూ ప్రచారం జరుగుతోంది. ఇలా ఇప్పటికే రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ జాగర్లమూడి సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.
పనులు మొదలెట్టాడు
మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అంటున్నా అతడి లుక్ మాత్రం అందుకు తగ్గట్లుగా కనిపించలేదు. దీంతో అసలు ఈ కుర్రాడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మోక్షజ్ఞ ప్రముఖ నటనా శిక్షకుడు (యాక్టింగ్ గురువు) సత్యానంద్ ఇస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. అలాగే, ఫైట్స్, డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు.

ఫస్ట్ మూవీపై రూమర్
నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. అతి త్వరలోనే అంటే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట. ఏపీ ఎన్నికలు అయిన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తాజాగా తెలిసింది.
ఆ డైరెక్టర్‌తోనే మూవీ
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా గురించి న్యూస్ లీకైన వెంటనే దాన్ని రూపొందించే డైరెక్టర్ పేరు కూడా రివీల్ అయింది. ఈ సినిమాను బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అతడు కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలిసింది. 'అఖండ 2' పూర్తైన వెంటనే దీన్ని మొదలు పెడతారని సమాచారం.

అల్లు అర్జున్ కథతోనే
వాస్తవానికి బోయపాటి శ్రీను.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ స్టోరీని రెడీ చేసుకున్నాడు. కానీ, బన్నీ కమిట్‌మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పుడిదే స్టోరీతో బోయపాటి శ్రీను.. మోక్షజ్ఞను పరిచయం చేయబోతున్నాడని తెలిసింది. అయితే, మొదటి చిత్రంతోనే హెవీ మాస్ స్టోరీని ఎంచుకోవడం కరెక్టేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











