బోయపాటి లిస్టులో అగ్ర హీరోలు.. నెక్స్ట్ ఎవరితో అంటే?

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఫామ్ లో ఉన్నప్పుడే ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. కానీ ఒక్క డిజాస్టర్ ఎదురైతే మాత్రం తెలిసిన వాళ్ళు కూడా మొహం చాటేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో అలాంటి వాతావరణాన్ని ఎదుర్కొని ఉంటారు. అందుకే వీలైనంత వరకు ఒక ఫ్లాప్ ఎదురైనప్పుడే ఆ తర్వాత సినిమా విషయంలో మరింత బలంగా కష్టపడుతుంటారు. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అదే తరహాలో హార్డ్ వర్క్ చేసే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది.

నిజానికి బోయపాటి శ్రీను లెజెండ్ సరైనోడు సినిమా తర్వాత ఒక్కసారిగా అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. అయితే బోయపాటి శ్రీను దాన్ని అవకాశంగా తీసుకోకుండా కేవలం తనకు నచ్చిన ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయక నుంచి అతని ఫామ్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.

Boyapati srinu upcoming projects planing with star heroes

గతంలో కొన్ని అపజయాలు చూసినప్పటికీ కూడా బోయపాటి శ్రీను అంతగా డౌన్ అవ్వలేదు. కానీ ఆ ఒక్క సినిమాతో అతను కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆ సినిమా ఫెయిల్ అన్నట్లు విడుదలైన కొన్ని రోజులకే అఫీషియల్ గా ప్రకటించడం బోయపాటికి ఏమాత్రం నచ్చలేదు. ఆ విషయంలో నిర్మాతలతో కూడా కాస్త విభేదాలు వచ్చినట్లు అప్పట్లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ అపజయం తర్వాత బోయపాటికి బాలకృష్ణ అండగా నిలిచాడు. ఇక బాలకృష్ణ రావడంతో అఖండ లాంటి పవర్ఫుల్ కథతో వచ్చిన బోయపాటి అభిమానులను ఎంతగానో మెప్పించాడు. ఆ సినిమా రెండు రోజుల్లోనే 40కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. మొత్తానికి టాలీవుడ్ మరోసారి సెట్టయినట్లు క్లారిటీ వచ్చేసింది. శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత బోయపాటితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు. బోయపాటి లిస్టులో అల్లు అర్జున్ తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఉన్నాడు. మహేష్ బాబు తో కూడా ఎప్పటినుంచో ఒక మాస్ యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక యువ హీరో రామ్ పోతినేని తో కూడా ఒకసారి చర్చలు జరిపాడు. అయితే వీరిలో బన్నీ తోనే సినిమా ముందుగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత బోయపాటి తో హీరోలందరూ ఎలాంటి సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X