కోట్లు కుమ్మరించినా వెనక్కి తగ్గని బోయపాటి శ్రీను.. అక్కడే బాలయ్య విశ్వరూపం..
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ మూవీ రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొంటున్నది. టైటిల్ మోషన్ లుక్‌తోపాటు రిలీజ్ చేసిన టీజర్ దక్షిణాదిలో అత్యథిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్లు అభిమానుల్లో ఆందోళనలకు గురిచేస్తున్నది. ఆ వివారాల్లోకి వెళితే...

38 మిలియన్ వ్యూస్‌తో అఖండ
ఇటీవల ఉగాది పండుగ కానుకగా అఖండ చిత్ర ట్రైలర్ సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. దక్షిణాదిలో సీనియర్ హీరోలకు సంబంధించిన మూవీ టీజర్లలో అత్యధికంగా వ్యూస్‌ను అఖండ రికార్డు సాధించింది. దాదాపు 38 మిలియన్ వ్యూస్‌ను సాధించడంతోపాటు సరికొత్త రికార్డును నెలకొల్పింది.

అఖండ రిలీజ్ వాయిదా?
ఇలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకొన్న అఖండ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి భయంకరంగా ఉండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసేందుకు ప్రయత్నించారు. సానుకూల పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఓటీటీ కంపెనీ 65 కోట్ల ఆఫర్
అయితే అఖండ సినిమాను ఓటీటీలో చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయనే వార్తలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ సంస్థ భారీ ఆఫర్‌ను అఖండ నిర్మాత ముందు పెట్టింది. దాదాపు 65 కోట్ల రూపాయల ఆఫర్‌ను ఇచ్చినా నిర్మాత, దర్శకులు అందుకు ఒప్పుకోలేదనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బోయపాటి థియేటర్ రిలీజ్ ప్లాన్
అఖండ సినిమాతో మరోసారి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా వెండితెరపై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో దర్శకుడు బోయపాి శ్రీను ఉన్నారు. అందుకే భారీ ఆఫర్‌ను కూడా నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్‌లో రిలీజ్ చేసిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











