క్రేజీ మోహన్ గా బ్రహ్మానందం
హైదరాబాద్: క్రేజీ మోహన్ అనగానే ప్రముఖ తమిళ సిని రచయిత గుర్తు వస్తారు. అయితే ఈ సారి మన తెలుగు తెరపై బ్రహ్మానందం క్రేజీ మోహన్ గా కనిపించి అలరించనున్నారు. రీసెంట్ గా పద్మనాభ సింహాగా బాద్షా చిత్రంలో అదరకొట్టిన బ్రహ్మానందం మరోసారి తన హాస్యంతో నవ్వించనున్నారు. ఇక ఈ పాత్ర రవితేజ చిత్రం బలుపులో కనిపించనుంది. కోన వెంకట్ ఈ చిత్రానికి రచన చజేస్తున్నారు.
గతంలో 'ఇడియట్' లాంటి విచిత్రమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ.... త్వరలో 'బలుపు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.
రవితేజ 2012 సంవత్సరం మొత్తం వరుస ప్లాపు సినిమాలతోనే కెరీర్ లాగించిన సంగతి తెలిసిందే. మాస్ అప్పియరెన్స్ రొటీన్ అయిపోయిందని... ఇటీవల 'సారొచ్చారు' సినిమాలో క్లాస్ అప్పీయరెన్స్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేక పోయింది. ఇలా వరుస ప్లాపుల నేపథ్యంలో.... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, 2013 సంవత్సరంలోనైనా హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభించాలని కమిట్ మెంట్ తో ఉన్నాడు రవితేజ. ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు.
పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి మెడికో పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాని తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











