For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సీతమ్మ వాకిట్లో...' లో బ్రహ్మానందం సీన్స్ కలిపేందుకు..

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్, మహేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' శుక్రవారం విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో ఎడిటింగ్ లో తొలిగించిన బ్రహ్మానందం సన్నివేశాలు మళ్ళీ కలపనున్నట్లు సమాచారం. సినిమాలో కామెడీ పరంగా తగ్గిందని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వినిపిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందంకు,బ్రహ్మాజి మధ్య ఓ ట్రాక్ షూట్ చేసారని, అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ అవటంతో దాన్ని తొలిగించారని సమాచారం. అయితే ఆ సీన్స్ కలిపితే మూడు గంటలకు డ్యూరేషన్ పెరుగుతుందని, ఇప్పుడే లెంగ్త్ 2 గంటల 39 నిముషాలు ఉండటంతో ఏం చేస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు వస్తున్న స్పందన అమోఘం. సినిమా చూసి జర్నలిస్టులు ఫోన్‌లు చేస్తుంటే కన్నీటిపొర ఆగలేదు. ఏడాది పాటు నేను పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాను'' అని దిల్‌రాజు అన్నారు. నా ప్రతి సినిమా విడుదలైనప్పుడు క్రాస్ రోడ్‌కెళ్ళి సెకండ్ షో చూసిన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వినడం అలవాటు. సీతమ్మ వాకిట్లో.. చూసిన వారు దగ్గరికొచ్చి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదంతా చూస్తుంటే పండుగ ముందే వచ్చిందా అనిపించింది. కొన్నిచోట్ల నుంచి మహిళలు భారీ సంఖ్యలో టిక్కెట్లు కావాలని ఫోన్లు చేస్తున్నారు.

  వారికి టిక్కెట్లను అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మహేష్, వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తెరపై హీరోలను చూడటం మర్చిపోయామని, పూర్తిగా అన్నదమ్ములను చూసిన భావనలో ఉండిపోయామని అంటుంటే ఆనందంగా అనిపించింది. నా కాళ్ళకు దణ్ణం పెట్టాలనిపిస్తుందని కొందరు ఫోన్లు చేశారు. శుక్రవారం మా టీమ్ అంతా ఆఫీసులో గంట సేపు కూర్చుని ఎంజాయ్ చేశాం. మంత్రి శ్రీధర్‌బాబు ఈ సినిమా చూసి మనసుతో స్పందించారు. డీవీడీ రాగానే పంపిస్తే ప్రతిరోజూ చూడాల్సిన సినిమా అని మెసేజ్ పెట్టారు.

  తాము మర్చిపోయిన ఇలాంటి కథను మేం తెరకెక్కించినందుకు చాలా ఆనందంగా ఉందని రాఘవేంద్రరావుగారు చె'ప్పడం ఆనందదాయకం. ఫేస్‌బుక్‌లోనూ, ట్విట్టర్లలోనూ వస్తున్న రెస్పాన్స్‌ను ఎప్పటికప్పుడు ప్రకాష్‌రాజ్ మాకు అందించారు. దాదాపు పాతికేళ్ళ తర్వాత తీసిన మల్టీస్టారర్‌కు ఎలాంటి స్పందన వస్తుందోనని శుక్రవారం ఉదయం రెండు గంటలు చాలా టెన్షన్ పడ్డాను. కానీ అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నాను. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహిస్తాం. '' అని అన్నారు.

  English summary
  According to inside information SVSC film makers after getting the first hand information on the film has decided to include the deleted scenes of Brahmanandam and Brahmaji while trimming the film from 3hrs duration to 2hrs 39 minutes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X